మరోసారి విజయసాయిరెడ్డికి నోటీసులు..

vijaya-sai-reddy-18.jpg

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి షాక్‌ తగిలినట్టు అయ్యింది. మరోమారు విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని సాయిరెడ్డికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు ఇప్పటికే ఈ నెల 10వ తేదీన మాజీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డికి మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేయగా మార్చి 12వ తేదీన అంటే ఈ నెల 12న సీఐడీ విచారణకు హాజరయ్యారు సాయిరెడ్డి. ఆ నోటీసుల్లో 506, 384, 420, 109, 467, 120 (b), రెడ్ విత్ 34 బీఎన్ఎస్ సెక్షన్లు ప్రస్తావించింది సీఐడీ కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయ సాయిరెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే, కాకినాడ పోర్టు వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారని విజయసాయిరెడ్డిపై కేవీ రావు ఫిర్యాదు చేసిన విషయం విదితమే పోర్టు వాటాల అక్రమ బదిలీపై సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డితో పాటు విజయ సాయిరెడ్డిపై మంగళగిరి సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, కాకినాడ సీ పోర్టు షేర్ల వ్యవహారంలో మరోసారి విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది సీఐడీ ఈనెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు.

Share this post

scroll to top