ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రమాణం.. శపథం నెరవేరిందన్న టీడీపీ శ్రేణులు..

cbn-21.jpg

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.44కు ప్రారంభయ్యాయి. ఈ మేరకు ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య అధ్యక్షతన శాసనసభ కొలువుదీరింది. అంతకు ముందు అసెంబ్లీ అవరణలోకి వచ్చిన చంద్రబాబు ప్రధాన ద్వారం వద్ద గుమ్మానికి సమస్కరించారు. అనంతరం వేద పండితులు పూర్ణకుభంతో సీఎం ఛాంబర్‌కు చంద్రబాబును తీసుకువెళ్లారు. అక్కగా వారు ఆయనకు ఆశీర్వాదం అందజేశారు. అక్కడి నుంచి చంద్రబాబు నేరుగా సభలోకి వెళ్లారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుమతితో చంద్రబాబు అసెంబ్లీలో శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిండు సభలో వైసీపీ నాయకులు తనను అవమానించింనందుకు గాను 2021 నవంబర్ 19న ఒకవేళ తాను సభకు అంటూ వస్తే సీఎంగానే వస్తానని చంద్రబాబు శపథం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించడంతో మరోసారి సీఎంగా చంద్రాబాబు ప్రమాణ స్వీకారం చేసిన సభలో అడుగుపెట్టారు. ఈ క్రమంలో అధితన శపథం నెరవేరిందంటూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

Share this post

scroll to top