సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం..జనసేనకు మరో కీలక పదవి..

jsp-11.jpg

ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించింది. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పలు కీలక శాఖల బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల్లో అన్ని సీట్లను గెలిచి ఏపీలో వంద శాతం స్టయిక్ సాధించిన జనసేనకి కేవలం మూడు మంత్రి పదవులు మాత్రమే దక్కాయి. దీంతో జనసేన కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. ఈ అసంతృప్తి పై పార్టీ అధినేతకు సమాచారం అందింది. ఈ క్రమంలో జన శ్రేణులను మరింత ఉత్సాహపరిచే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వంలో అత్యంత‌ కీలకమైన అదనపు అడ్వకేట్ జనరల్ (AAG) పదవిని కూడా జనసేన పార్టీకి కేటాయించారు. ఇటీవ‌ల అడ్వ‌కేట్‌ జనరల్‌గా ద‌మ్మాలపాటి శ్రీనివాస్‌కు అవ‌కాశం వచ్చింది. రెండో కీల‌క స్థాన‌మైన AAG ప‌ద‌విని జ‌న‌సేన‌కు ఇచ్చారు. జ‌న‌సేన లీగ‌ల్ వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు సాంబశివ ప్రతాప్‌కు ఈ పదవి దక్కింది.

Share this post

scroll to top