హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లు చెల్లించమన్నందుకు విధుల్లో ఉన్న అధికారులపై చేసిన దాడి ఇది. కాళ్లతో ఛాతిపై తన్నుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్న వీడియో అప్పట్లో అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది. పాతబస్తీ పరిధిలో కరెంట్ బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వసూలు చేయడమంటే అధికారులకు వణుకే. ఎవరెప్పుడు ఎలా ఎదురు తిరుగుతారో.. ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి. పైగా కరెంట్ కట్ చేస్తే అదో తలకాయ నొప్పి. దీంతో అటు వసూలు చేయలేక.. ఇటు పై అధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా ఉచితంగా రావాలన్నది కొంతమంది అభిమతంగా కనిపిస్తోంది. దాదాపు 40శాతం మందికి పైగా విద్యుత్ బిల్లులు చెల్లించరనే ఆరోపణలు ఉన్నాయి.
పాతబస్తీలో కరెంట్ బిల్ వసూలు చేయడం కష్టమేనా బకాయిలు వసూలు అయ్యేదెలా?
