కప్పట్రాళ్ల ప్రాంతాన్ని కూడా పవన్‌ సందర్శించాలి..

ramakrishna-05.jpg

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కప్పట్రాళ్ల ప్రాంతాన్ని కూడా సందర్శించాలని సూచించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన కప్పట్రాళ్ల వద్ద యురేనియం కోసం 11 ఎకరాల్లో 68 బోర్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు. పులివెందుల, ఆళ్లగడ్డలో యురేనియంపై టీడీపీ, సీపీఐ కలసి వ్యతిరేకించాం కానీ, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు యురేనియం తవ్వకలుచేస్తే ఎలా? అని ప్రశ్నించారు. అందుకే ఈ ప్రాంతాన్ని పవన్‌ పరిశీలించాలని సలహా ఇచ్చారు. ఇక, బెదిరింపుల ద్వారా యురేనియం కి వ్యతిరేకంగా ఆందోళనలు ఆపాలని ప్రయత్నిస్తే ఉద్యమాలు ఆగవు అని హెచ్చరించారు రామకృష్ణ.

కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజాలపై భారం మోపుతుంది పెద్ద కంపెనీలకు దోచి పెట్టడానికి విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు అని గుర్తుచేశారు రామకృష్ణ. విజయవాడలో 7న వమాపక్షపార్టీల సమావేశం నిర్వహిస్తున్నాం కలసి వచ్చే పార్టీలతో ఆందోళన చేస్తాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం అన్నారు. శాంతిభద్రతలు ప్రభుత్వం ఫెయిల్యూర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా అంగీకరించారు. మూడేళ్ల బాలికపై కూడా అత్యాచారం చేస్తున్నారు. హోం మంత్రి బాధ్యత తీసుకోవాలని పవన్ అంటున్నారు.

Share this post

scroll to top