ఒకదానికి మించి మరొక అపచారం..

ttd-12-.jpg

తిరుమలలో మహాపరాథం చోటు చేసుకుంది. ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. క్యూలైన్ దాటుకుని ఏకంగా ఆలయం మహా ద్వారం వరకు వచ్చేశారు. ఏ మాత్రం ఆలస్యం జరిగి ఉన్నా ఆ ముగ్గురు కూడా చెప్పులతో ఆలయంలోకి అడుగు పెట్టుండేవాళ్లే. ఆ సమయంలో మహాద్వారం వద్ద గుర్తించిన విధి నిర్వహణలో ఉన్న టీటీడీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. చెప్పులు వదిలి ఆలయంలోనికి వెళ్లాలని చెప్పారు. దీనితో ఆ ముగ్గురూ తమ చెప్పులను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి ప్రవేశించారు.

దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. క్యూ లైన్‌ను దాటుకుని ఈ ముగ్గురు భక్తులు చెప్పులతో ఏకంగా మహా ద్వారం వద్దకు ఎలా వచ్చారనేది అంతు చిక్కట్లేదు. ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్ విభాగం గానీ, సిబ్బంది గానీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టమౌతోంది. నిజానికి- వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది.

Share this post

scroll to top