హుటాహుటిన గొల్లప్రోలులోని జగనన్న కాలనీకిఉంటున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన గొల్లప్రోలులోని జగనన్న కాలనీకి చేరుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పడవలో ప్రయాణించిన డిప్యూటీ సీఎం.. బాధితులను కలిసి మాట్లాడారు. వరద ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తానని, వరద బాధితులకు అవసరమయిన సహాయాన్ని అందిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. జిల్లా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి, బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. ముఖ్యంగా ఏలేరుకు దిగువన గల సుద్దగడ్డవాగుకు వరద పోటెత్తడంతో స్థానిక కాలనీలు అన్నీ నీటిలో మునిగిపోయాయి. అలాగే ఏలేరు ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీగా వరద వచ్చి చేరుతుండటంతో కిర్లంపూడి, పిఠాపురం, జగ్గంపేట ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
హుటాహుటిన గొల్లప్రోలులోని జగనన్న కాలనీకి పవన్..
