పిఠాపురం పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలకు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నిధులతో మహిళలకు పూజా సామాగ్రి, చీరలు పంపిణీ చేయనున్నారు. 12 వేల మంది మహిళలకు శుక్రవారం చీరలు, వ్రత పూజ సామాగ్రి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జనసైనికులు, వీర మహిళలు తగు ఏర్పాటు చేయాలని, పూజకు వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జనసేనాని అదేశాలు జారీ చేశారు.
పిఠాపురం మహిళలకు పవన్ కల్యాణ్ సర్ ప్రైజ్ గిఫ్ట్స్..
