వినాయక చవితి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజలకు కీలక సూచన చేశారు. పర్యావరణ హితంగా వినాయక చవితి నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వినాయక చవితిని మట్టి వినాయకులే పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా అవగాహన కల్పించాలని కోరారు. కాగా పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారు.
వినాయక చవితి పండుగపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..
