కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు వంద శాతం హాజరవుతానని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అయితే ఇంత వరకు ఎలాంటి నోటీసులు తనకు అందలేదని ఆయన తెలిపారు. అయితే తనకు నోటీసులు పంపిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. తనకు నోటీసులు అందిన అనంతరం ఈ విషయాన్ని పార్టీలో చర్చించి అధిష్టానం నిర్ణయానికి అనుగుణంగా తాను ముందుకు వెళ్తానన్నారు ఎంపీ ఈటల రాజేందర్. ప్రభుత్వం నీది నువ్వు ఎలాంటి విచారణ అయినా చేయి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన సవాల్ విసిరారు. గతంలో దేవరాయాంజాల్ భూముల విషయంలో కేసీఆర్ చేసిన తప్పే నేడు నువ్వు చేస్తున్నావంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ఈటల రాజేందర్ మండిపడ్డారు.
కాళేశ్వరం నోటీసులపై ఈటల ఫస్ట్ రియాక్షన్..
