ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుపై కసరత్తును స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయా బహిరంగసభల్లో మాట్లాడుతూ.. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తాజాగా రుణమాఫీకి 2023 డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేందుకు రూ.30 వేల కోట్లు అవసరం కానుండగా రైతు సంక్షేమ కార్పొరేషన్‌కు రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కారు భావిస్తోంది.
రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ కటాఫ్ తేదీ ఎప్పటి వరకు అంటే..?
