పచ్చి బొప్పాయి అనేక సమస్యలకు దివ్యౌషధం.. ముఖ్యంగా ఈ సమస్యలకు చెక్

helth-28-.jpg

బొప్పాయి పండు అంటే అందరికీ ఇష్టమే.. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇది రుచికి, ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పండిన బొప్పాయి కడుపుకు చాలా ప్రయోజనకరంగా ఉంటే.. పచ్చి బొప్పాయి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా.. పచ్చి బొప్పాయి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మారుస్తుంది. మలబద్ధకం, వికారం నుండి ఉపశమనం అందిస్తుంది. అంతేకాకుండా.. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల నుండి మహిళలను రక్షిస్తుంది. అయితే.. గర్భధారణ సమయంలో బొప్పాయి పండు తినకూడదు.

కామెర్లు.. వీటిని జాండిస్ అని కూడా పిలుస్తారు. ఇది తీవ్రమైన వ్యాధి. అయితే.. ఈ వ్యాధిని నివారించడానికి పచ్చి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. ప్రతి మూడు గంటలకోసారి అరగ్లాసు బొప్పాయి రసం తాగడం వల్ల జాండిస్‌లో ఉపశమనం లభిస్తుంది. బొప్పాయిలో డైజెస్టివ్ ఎంజైమ్ పాపైన్ ఉంటుంది. ఇది ప్రొటీయోలైటిక్ ఎంజైమ్.. దీని నుండి మందులు కూడా తయారు చేస్తారు.

పచ్చి బొప్పాయి యాంటీ పరాన్నజీవి, యాంటీ అమీబిక్.. ఇది ప్రేగు కదలికలతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది అజీర్ణం, యాసిడ్ రిఫ్లక్స్, అల్సర్, గుండెల్లో మంట మరియు గ్యాస్ట్రిక్ సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.

బొప్పాయి ఎండిన ఆకులు ఆస్తమాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది . 2022 సంవత్సరంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. బొప్పాయిలో బీటా కెరోటిన్, లైకోపీన్ మరియు జియాక్సంతిన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు ఉంటాయి.

పచ్చి బొప్పాయిలో ఉండే విటమిన్ ‘ఎ’, ‘సి’ మలేరియా రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. 

Share this post

scroll to top