జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి మధ్య కొలిక్కిరాని చర్చలు..

jc-28.jpg

తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఆర్టీపీపీ ప్లైయాష్ రవాణా రచ్చకు సంబంధించి కూటమి నేతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. దీంతో మరోసారి ఇరువర్గాల నేతలు చర్చించుకుంటున్నారు. ఆర్టీపీపీ దగ్గర, అనంతపురం కడప జిల్లాల బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చిఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ప్లైయాష్ కోసం వచ్చి వాహనాలు ఆగిపోయాయి. జేసీ వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో ఆర్టీపీపీ దగ్గర లారీలు నిలిచి పోయాయి. కాగా ప్లైయాష్ లోడు లేకుండా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి డ్రైవర్లు అంటున్నారు.

కాగా జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి ఇద్దరూ కూట‌మి నేతలే కావ‌డం విశేషం. జేసీ దివాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రికి చెందిన టీడీపీ నాయ‌కుడు, ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. వీళ్లిద్దరి మ‌ధ్య ప్లైయాష్ త‌ర‌లింపున‌కు సంబంధించిన ఒప్పందంపై విభేదాలు తలెత్తాయి. జ‌మ్మల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి ఆర్టీపీపీ వ‌స్తుంది. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రిగినా త‌మ క‌నుస‌న్నల్లోనే జరగాలని ఆదినారాయ‌ణ‌రెడ్డి భావిస్తున్నారు. అయితే తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని సిమెంట్ ప‌రిశ్రమ‌ల‌కు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల వాహ‌నాలు ప్లైయాష్ త‌ర‌లిస్తున్నాయి. దీనిపై ఒప్పందం కుద‌ర‌క‌పోవ‌డంతో జేసీ దివాక‌ర్‌రెడ్డి వాహ‌నాల్ని ఆర్టీపీపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో రానివ్వకూడ‌ద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గీయులు పంతం ప‌ట్టారు.

Share this post

scroll to top