టీడీపీకి కాంగ్రెస్ తోకపార్టీ కాదని ఆమె అంటున్నారు.మంచిదే. ఆ విషయాన్ని ఆచరణలో చూపించాలి కదా? టీడీపీవారి స్క్రిప్ట్ ప్రకారం వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తే ఎవరైనా ఏమంటారు?తమలపాకుతో టీడీపీని, తలుపుచెక్కతో వైఎస్సార్‌సీపీని కొట్టినట్లుగా విమర్శలు చేయడం ద్వారానే షర్మిల తన మనోగతాన్ని తెలియచేస్తున్నట్లు కనిపిస్తుంది. మరో కొత్త ప్రచారాన్ని ఆమె తెరపైకి తీసుకురావడం ద్వారా తాను చంద్రబాబు మద్దతుదారునని చెప్పకనే చెప్పారు. ఈ ఎన్నికలు చంద్రబాబు సీఎం.కావాలా? వద్దా?అన్న కోణంలో జరిగాయట.చంద్రబాబుకు అనుభవం ఉందట. సమర్దుడు అని ప్రజలు అవకాశం ఇచ్చారని ఆమె సర్టిఫికెట్ ఇచ్చారు.ఒకనెల రోజుల క్రితం ఈమెనే ఈ ఎన్నికలు జగన్ పై జరిగినవని అన్న సంగతి మర్చిపోయి ఉంటారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి ఆమె పరోక్ష మద్దతు ఇస్తున్నారు.అదే టైమ్ లో టీడీపీ, జనసేన,బీజేపీ కూటమితో పోరాడిన వైఎస్సార్‌సీపీ ని బీజేపీ తోకపార్టీ అని షర్మిల అనడం చిత్రంగానే ఉంది.వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు, వైఎస్ రాజశేఖరరెడ్డికి సంబంధం లేదట.
నాన్ననంటే నొప్పి లేదు.. బాబు కోసం బయలుదేరావా తల్లీ..
