ఇంతకాలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉన్నారనిపిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యధాతధంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంత ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది. ప్రతి నెల మొదటి తేదీన వృద్దాప్య పెన్షన్ లు వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లకు గౌరవవేతనంతో పాటు ఇళ్లవద్దే ఉండి నెలకు ఏభైవేల రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది రోజులలోనే వలంటీర్లను వారి విధుల నుంచి పక్కనబెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.
ఇంతకాలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు..
