ఇంటి ఆహారానికి బదులు.. బయటి ఆహారానికి అలవాటు పడడం వల్ల నేటికాలంలో అధిక మంది యువతలో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోంది. శరీరాన్ని రోగాల బారిన పడకుండా ఉంచేందుకు అల్లం ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ అల్లం రసం తీసుకోవడం వల్ల కాలేయ నిర్విషీకరణకు సహాయపడుతుంది. అల్లం టీని కూడా తాగవచ్చు. ఒక కప్పు నీటిలో అల్లం వేసి మరిగించాలి. అందులో కాస్తింత నిమ్మరసం, దాల్చిన చెక్క పొడి మిక్స్ చేసి తాగాలి. ఈ డ్రింక్ అజీర్ణం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
రోజువారీ ఆహారంలో ఒక వెల్లుల్లి రెబ్బను తప్పక తీసుకోవాలి. వెల్లుల్లి కాలేయ ఎంజైమ్‌లను సక్రియం చేయడం ద్వారా శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. వెల్లుల్లి తింటే కూడా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు. చాలా మంది బరువు తగ్గడానికి గోరింటాకు రసాన్ని తాగుతుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. గోరింటాకు రసం కాలేయంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను కూడా బయటకు పంపుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరింటాకు రసం తాగితే ఫ్యాటీ లివర్ సమస్య దూరం అవుతుంది.