మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేసిన ఇష్యూలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే,ఈవీఎం ధ్వంసం చేయకముందు అసలు ఏమి జరిగింది.? అసలు ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లో టీడీపీ కార్యకర్తలు ఏం చేశారు.? ఇది అంతా ఈసీ ఎందుకు దాచి పెట్టింది.? దాని వెనుక ఎవరి హస్తం ఉంది..? అది ఇప్పుడు చూద్దాం..!
ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లో టీడీపీ రిగ్గింగ్ కి పాల్పడినట్లు సమాచారం. అయితే, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పిన్నెల్లి వారిని ప్రశ్నించగా వారు నోరు మెదపకపోవడంతో.. ఈవీఎం ధ్వంసం చేశారని వైసీపీ వెల్లడించింది. కాగా, ఈ వీడియో 13వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో రికార్డు అవ్వగా.. ఇన్ని రోజులకు భయటికి రావడం గమన్నార్హం. ఇదంతా సీసీ కెమోరాలో రికార్డు అయినా ..ఎలక్షన్ కమీషన్ ఎందుకు రీపోలింగ్ ఎందుకు పెట్టడం లేదు.? పది రోజులపాటు ఈ వీడియోని ఎలక్షన్ కమీషన్ ఎందుకు భయటపెట్టలేదని జర్నలిస్ట్ వైయన్ ఆర్ ప్రశ్నించారు. ఏపీలో దాదాపు 6లేదా 7 చోట్ల ఈవీఎం ధ్వంసం కాగా ఎలక్షన్ కమీషన్ ఎందుకు భయటపెట్టలేదని ఆరోపించారు. ఈ వీడియో ఎలక్షన్ కమీషన్ నుంచి టీడీపీ ఎక్స్ కి ఎలా వెల్లిందో తెలపాలని డిమాండ్ చేశారు.