వైఎస్‌ జగన్‌ను కలిసిన పలువురు నేతలు..

ys-jagan-19.jpg

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలు కలిశారు. వైఎస్‌ జగన్‌ కలిసిన వారిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఉదయం నుండి క్యాంప్ కార్యాలయానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అందరినీ కలిసిన వైఎస్‌ జగన్‌.. వారికి ధైర్యం చెప్పారు. ఈ నెల 21న అసెంబ్లీ సమా­వేశాల దృష్ట్యా వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు వైఎస్‌ జగన్‌ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్ల­మెంట్‌ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్య­ర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశాని­ర్దేశం చేయనున్నారు. అలాగే జూన్‌ 19నాటి పులివెందుల పర్యటనను వైఎస్‌ జగన్‌ వాయిదా వేసుకున్నారు.

Share this post

scroll to top