రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం రోజే ప్రకటించారు. దానికి తగినట్టుగానే ఈ రోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక, విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ దగ్గరకు వెళ్లకముందే ఎంపీ గురుమూర్తి సాయిరెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. రాజీనామా చేయొద్దని సాయి రెడ్డిని కోరాను అని కానీ, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు విజయసాయిరెడ్డి చెప్పడంలేదన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సమస్యలు లేవు అని స్పష్టం చేశారు ఎంపీ గురుమూర్తి.