నోట్లో బట్టలు కుక్కి మరి పెట్రోల్ పోసి తగలబెట్టాడు..

lahari-9.jpg

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారణం చోటుచేసుకున్నది. ప్రేమించలేదనే కారణంతో ఇంట్లో నిద్రిస్తున్న ఇంటర్‌ విద్యార్థినిపై ఓ ప్రేమోన్మాది పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. అరవకుండా ఆమె నోట్లో బట్టలు కుక్కాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం తాను కూడా నిప్పంటుకున్నాడు. అయితే గమనించిన స్థానికులు మంటలు ఆర్పి అతడికి దేహశుద్ధి చేశారు. అయితే వారినుంచి తప్పించుకున్న యువకుడు చికిత్స నిమిత్తం దవాఖానలో చేరాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాలికను లహరిగా గుర్తించారు. ఆమె స్వస్థలం వెల్దుర్తి మండలం రామళ్లకోట అని, తండ్రి చనిపోవడంతో నందికొట్కూరులోని బైరెడ్డి నగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నట్లు తెలుస్తున్నది. నిందితుడిని కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్రగా గుర్తించారు. అతడు గత కొంత కాలంగా లహరిని ప్రేమిస్తున్నాని వేధిస్తున్నట్లు సమాచారం.

Share this post

scroll to top