ఎన్నికల ఫలితాలు విడుదలై డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ తొలిసారి ఏపీ రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ తనకు కేటాయించిన చాంబర్ పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. 2017 తర్వాత పవన్ సచివాలయానికి రెండవసారి వెళ్లనున్నారు. నాడు ఉద్దానం సమస్యలపై అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి చర్చించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్తున్నారు. రాష్ట్ర సచివాలయంలోని బ్లాక్-2లో తనకు కేటాయించిన ఛాంబర్‌ని పవన్ పరిశీలించనున్నారు. రేపు పంచాయతీరాజ్, గ్రామీణ, పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఏపీ సచివాలయానికి పవన్..
