ఉద్యోగులకు సీఎం చంద్రబాబు షాక్..

CBN.jpg

సీఎం చంద్రబాబు ప్రక్షాళన చేపట్టారు. గత ప్రభుత్వంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపై ఆయన ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయంలో ఉన్న ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు. ఇలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సీఎస్ నీరభ్ కుమార్ అన్ని శాఖలను, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలను ఆదేశించారు.

Share this post

scroll to top