ఆగని పచ్చమూకల బరితెగింపు..

rowdey-10.jpg

తిరుపతి జిల్లాలో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. వెంకటగిరిలో వైఎస్సార్‌సీపీ నేత తంగా పేచీరాజ్‌పై దాడి చేశారు. ఆయన తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులతో టీడీపీ నేతలు దాడి చేశారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలో వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త, దివ్యాంగుడైన జు­వ్వా­­ది అశోక్‌బాబుపై టీడీపీ శ్రేణులు దాడిచేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచి్చంది. తీవ్రంగా గాయపడిన అశోక్‌బాబు ఆస్పత్రి నుంచి ఇంటికి వచి్చన తరువాత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ బాలరాంరెడ్డి తెలిపిన మేరకు.. మండలంలోని గణపవరం శాంతినగర్‌కు చెందిన అశోక్‌బాబు నూరుశాతం దివ్యాంగుడు. వీల్‌చైర్‌కే పరిమితం. ఈ నెల ఒకటో తేదీన పింఛను రూ.6 వేలు టీడీపీ నాయకులు అందించారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు మోటార్‌ సైకిల్‌పై అశోక్‌ ఇంటి వద్దకు వచ్చారు. వీల్‌చైర్‌లో ఇంటి గుమ్మం వద్ద అశోక్‌ తలమీద బీరుసీసాతో కొట్టి పరారయ్యారు.

Share this post

scroll to top