బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండ కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా వానలు కురుస్తున్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలే భారీగా ఉన్నాయి. వాటిని కొనలేక సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఏ రకం కూరగాయాలను చూసిన ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కూరగాయల ధరలకే తట్టుకోలేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో త్వరలో ఇంకాస్తా పెరుగుతాయనే వార్తలు బయటకు వస్తున్నాయి.
గతకొన్ని రోజులుగా కురుస్తున్నవానలకు భారీగా పంట నష్టం జరిగింది. చేతికి వచ్చిన పంటలు నీటి పాలయ్యాయి. దీంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో కురిసిన వానలకు కూరగాయల పంటలు బాగా దెబ్బతిన్నాయి. అలానే మార్కెట్లకు రావాల్సిన కూరగాయల వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. దీంతో మార్కెట్లో కి రావాల్సిన కూరగాయలు ఆలస్యం అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కూరగాయల నిల్వలు తగ్గిపోయి రాబోయే రోజుల్లో సప్లయ్ బాగా పడిపోతే ధరలు అమాంతం పెరగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.