పంచాయతీ రాజ్ శాఖకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

pspk-12-1.jpg

పంచాయతీ రాజ్ శాఖ కోసం త్వరలోనే ఓ మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ ఆయన అమరావతిలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. పట్టణాలు, గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ అస్తవ్యక్తంగా ఉందని, నిర్వహణ కూడా సరిగ్గా లేదని అయన అన్నారు. వ్యర్థాల నుంచి కూడా ఆదాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఏటా రూ.243 కోట్ల విలువైన వ్యర్థాలను పడేస్తున్నాయని అన్నారు. అదే వ్యర్థాల నిర్వహణ సరిగా ఉంటే ఆ వనరును ఆదాయంగా మార్చుకోవచ్చని అధికారులకు సూచించారు. ఆ ఆదాయాన్ని పారిశుధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వచ్చని అన్నారు. అధికారులు ఇకనైనా డంపింగ్ యార్డులపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు.

Share this post

scroll to top