జగన్ ఢిల్లీలో ధర్నాకు ఇండీకూటమిలోని అన్ని పార్టీల నాయకులు హాజరైనా కాంగ్రెస్ సభ్యులు మాత్రం దూరంగా ఉన్నారు. అయితే వారంతా కూటమిలో అంతర్గతంగా సంప్రదించుకోకుండా ఎవరికి వారు స్వచ్ఛందంగా వచ్చి ఉంటారని అనుకోలేం. కానీ కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం వెనుక పెద్ద వ్యూహమే అన్నట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ పరోక్షంగా తమ మద్దతు జగన్‌కే ఉంటుందని మొన్న అఖిలపక్ష సమావేశం తర్వాత జైరాం రమేశ్ టీడీపీని కార్నర్ చేసి ట్వీట్ చేయడం ద్వారా అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సోదరి షర్మిలతో జగన్ కు కొన్ని ఇబ్బందులున్నాయి. వాటిని పరిష్కరించుకున్నాక కూటమిలో చేరడమో లేదా ఏదైనా మంచి సందర్భం కోసం వేచిచూస్తున్నారా అనేది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాను కాంగ్రెస్ కు మద్దతు ప్రకటిస్తే జగన్ ను ఎప్పుడెప్పుడు జైలుకు పంపాలా అని వేచిచూస్తున్న టీడీపీ దానిని అవకాశంగా మలుచుకోవచ్చు. బీజేపీపై కూడా తన వ్యతిరేకులపై ఈడీ, సీబీఐ కేసులు ప్రయోగించి వేధిస్తుందనే అపవాదు లేకపోలేదు. ఈ వ్యవహరాలన్నింటినీ ఆలోచించి ముందుకెళ్లాలని అనుకొని ఉండవచ్చు. ఒకవేళ పాత కేసులు తిరగతోడి జగన్ ను జైలుకు పంపితే గనుక ఇండీకూటమి సపోర్టు జగన్ కు కచ్చితంగా ఉంటుందనేది పరిశీలకుల అంచనా ఎందుకంటే ధర్నా అనంతరం ఇండీ అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఎక్స్ లో జగన్ ధర్నాకు అనుకూలంగా పోస్ట్ చేయడాన్ని తీసిపారేయలేం. ఇదంతా వ్యూహాత్మకంగా బీజేపీని ఇరుకున పెట్టడానికి జరుగుతున్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు.
జగన్ ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వకపోవడం వెనుక పెద్ద వ్యూహమే..
