గతంలో తనకున్న జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను అంతమొందించడమే ప్రస్తుత అధికార కూటమి ప్రధాన లక్ష్యమని, తనకున్న ప్రాణహానిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదంటూ ఆయన సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకున్న ప్రాణహానిని సరైన రీతిలో మదింపు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను కుదించిందని, ఈ నేపథ్యంలో.. 3–6–2024 నాటికి తనకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో కోర్టును కోరారు. అంతేగాక పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు, కౌంటర్ అసాల్ట్ టీమ్స్, జామర్లను సైతం అందుబాటులో ఉంచేలా ఆదేశాలివ్వాలని అభ్యర్ధించారు. తన భద్రత కుదింపు విషయంలో చట్టం నిర్దేశించిన ప్రమాణాలకు, రాజ్యాంగ అధికరణలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కుదించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్..
