Tag Archives: kcr

ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ చేరుకున్నారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు గవర్నర్‌ తమిళసై, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఈ పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరంగా ఉంటున్నారు. స్వల్ప అస్వస్థత కారణంగా ఆయన ఈ పర్యటనకు దూరంగా ఉంటున్నట్లు అధికారులు తెలిపారు. జ్వరం తగ్గితే ముచ్చింతల్‌ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read More »

హైదరాబాద్‌ లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ప్రారంభం

దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ కేంద్రం (ఐఎఎంసి) హైదరాబాద్‌లో ప్రారంభమయింది. నానక్‌రాంగూడ ఫొనిక్స్‌ వీకే టవర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని సిజెఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రారంభించారు. వీరితో పాటు జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు కూడా ఉన్నారు. ఈ సెంటర్‌ను సిజెఐ జస్టిస్‌ ఎన్‌వి రమణకు సిఎం కెసిఆర్‌ అప్పగించారు. ఇద్దరూ కలిసి ఐఎఎంసిలోని వసతులు, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసినప్పటికీ, త్వరలో సొంత భవనం నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్‌ హామీ ఇచ్చారు. ...

Read More »

టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్‌ రాజీనామా

టిఆర్‌ఎస్‌ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధానికి… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలో ఉన్న తన నివాసంలో రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ… తన వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేశారని అన్నారు. ఉద్యమం నుంచి టిఆర్‌ఎస్‌ పార్టీలో తన పాత్రను వివరించడంతోపాటు తనకు ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా మీడియా ముందు వెల్లడించారు.   టిఆర్‌ఎస్‌ నుంచి ఎన్నిసార్లు బీ ఫాం ఇచ్చినా తాను గెలిచానని చెప్పారు. తెలంగాణ ప్రజల ...

Read More »

కేసీఆర్‌ దారిలోనే ఈటల

ఏది ఏమైనా ఈ రాజకీయ అనిశ్చిత్తిలో ఉండిపోయిన మాజీ మంత్రి ఈటల గ్రహశాంతి జరిపిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. యాగాలు చేస్తే గండం గట్టెక్కి మళ్లీ పూర్వ వైభవం కలిసివస్తుందనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాలు జరిపిస్తున్నట్లు తెలుస్తోంది. గడిచిన మూడు రోజులుగా శామిర్‌పేట్‌లోని ఆయన నివాసంలో జరుగుతున్న పూజలు దీనికి బలం చేకూరుస్తోంది. తాజా పరిణామాల నుండి ఉపశమనం పొందేందుకు, రాబోయే రాజకీయ భవిష్యత్తు సాఫీగా సాగేందుకు, శత్రువుల నుండి రక్షణ కోసం మాజీ మంత్రి ఆరుగురు పండితులతో యాగాలు, పూజలు చేయడం ఇప్పుడు ఆసక్తిగా ...

Read More »

రేపు కేసీఆర్ బహిరంగ సభ

రేపు సీఎం కేసీఆర్ హాలియా బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో 2014 లో 2 రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగితే ఇవాళ 12 లక్షల మెట్రిక్ టన్నులధాన్యం ఇచ్చే స్థితికి నల్గొండ జిల్లా చేరుకుందని అన్నారు. రాష్ట్రంలోనే అధికంగా సాగుబడి చేస్తున్న జిల్లా నల్గొండ జిల్లా అని పేర్కొన్న ఆయన ఉమ్మడి జిల్లాలో ప్రతి ఇంచుకు నీరిచ్చేందుకు  సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు ఉపయోగ ...

Read More »

ఈ నెల 7న సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక సమావేశం నిర్వహించనున్నారు.  ఈ నెల 7న(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.  ఈ సమావేశానికి రాష్ట్ర కమిటి సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డిసిసిబి అధ్యక్షులు, డిసిఎంఎస్ అధ్యక్షులు హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వాల ...

Read More »

ఆస్పత్రిలో చేరిన కెసిఆర్‌

తెలంగాణ సిఎం కెసిఆర్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన కెసిఆర్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో ఆస్పత్రిలో చేరారు. దీంతో ఆయనకు ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ పరీక్షలు చేయనున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

Read More »

భార‌త్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ మ‌ద్ద‌తు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా  ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ అధ్య‌క్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన తెలిపారు.  వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తోన్న న్యాయ‌మైన పోరాటాన్ని కేసీఆర్ స‌మ‌ర్థించారు.  రైతుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నందునే పార్లమెంటులో వ్యవసాయ బిల్లులను టీఆర్ఎస్ వ్యతిరేకించిందని,  ఈ చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం కొనసాగించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ...

Read More »

ప్రాంతీయ భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోడీకి వేర్వేరుగా శుక్రవారం ఉదయం లేఖలు రాశారు. హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాత్రమే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర ప్రాంతీయ భాషల అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను ఆయన తెలిపారు. అలాగే రాష్ట్రపతికి రాసిన లేఖలో ...

Read More »

తక్షణ సాయంగా రూ.1350 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి కేసీఆర్ లేఖ

వర్షం వల్ల అతలాకుతలమైన తెలంగాణకు సాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తక్షణ సాయం కింద రూ.1350 కోట్లు సాయం అందించాలని సీఎం కోరారు. భారీ వర్షం, వరదల కారణంగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని కేసీఆర్ తన లేఖలో వివరించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా రూ.5000 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రధానికి వివరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సహాయం, పునరావాస చర్యల ...

Read More »