Tag Archives: pm

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం మోదీ అధ్యక్షతన సమావేశం

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటూ ఇతర కీలక నేతలైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దియో సాయ్ తదితరులు పాల్గొన్నారు.

Read More »

సుప్రీంకోర్టు ఈమెయిల్స్‌లో ప్రధాని మోడీ యాడ్‌.. తొలగించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం

 వచ్చే ఏడాది 75 సంవత్సరాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ను ప్రోత్సహించడానికి కేంద్రం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇది ఆరు నెలల క్రితం మొదలు పెట్టగా.. పెద్ద యెత్తున ప్రచారం చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి అడ్వకేట్లకు వస్తున్న ఈ మెయిల్స్‌లో ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాని మోడీ ఫోటోలతో కూడిన యాడ్స్‌ రావడం ఇప్పుడు ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తోంది. ఈ మెయిల్స్‌లో ఆయన చిత్రాలు రావడాన్ని కొంత మంది సీనియర్‌ అడ్వకేట్లు ధ్రువీకరించారు. ఈ చర్య ...

Read More »

పిఎం కిసాన్‌ ఎనిమిదో విడత నిధులు విడుదల

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పిఎం-కిసాన్‌) కింద ఎనిమిదో విడతలో భాగంగా రూ. 20 వేల కోట్లను ప్రధాని మోడీ శుక్రవారం విడుదల చేశారు. ఈ మొత్తం 9.5 కోట్ల మంది అన్నదాతలు ఖాతాల్లో నేరుగా జమకానుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ నిధులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మాట్లాడుతూ..ఈ పథకంలో పశ్చిమ బెంగాల్‌ చేరిందని, రాష్ట్రంలో 7 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందారని తెలిపారు. పిఎం కిసాన్‌ పథకం ...

Read More »

కరోనా పరిస్థితులపై నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ ఫోన్‌

రాష్ట్రంలో తగ్గుతున్న పాజిటివిటీ రేటు, వేగంగా పెరుగుతున్న రికవరీ రేటుపై ప్రధాని మోడీకి అప్‌డేట్‌ ఇచ్చినట్లు మధ్యప్రదేశ్‌ ఎంపి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ట్వీట్‌ చేశారు. జనతా కర్ఫ్యూ సహా వైరస్‌ ఎదుర్కొవడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయనకు వివరించినట్లు తెలిపారు. తమ చర్యల పట్ల మోడీ ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారని, కేంద్రం నుండి అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీనిచ్చారని చెప్పారు. కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ అందించేందుకు, ఆసుపత్రి పడకల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న చర్యల గురించి ప్రధానికి ...

Read More »

నూతన చట్టాలు వ్యవసాయ, ఇతర రంగాల మధ్య అడ్డుగోడలు తొలుగుతాయి

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు..వ్యవసాయ, అనుబంధ రంగాల మధ్య అడ్డంకులను తగ్గించడానికి దోహదపడతాయని ప్రధాని మోడీ అన్నారు. ఈ చట్టాలు సాంకేతిక పురోగతి, పెట్టుబుడులు పొంది, రైతులకు కొత్త మార్కెట్లను సృష్టిస్తాయని ఫెడరేషన్‌ఆఫ్‌ ఇండియన్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ 93వ వార్షిక సదస్సులో భాగంగా వర్చువల్‌ సమావేశంలో ప్రసంగించారు. ఒక రంగం అభివృద్ధి చెందితే…ఆ ప్రభావం మిగిలిన రంగాలపై కూడా ఉంటుందని అన్నారు. అలా కాదని, పరిశ్రమల మధ్య అనవసరమైన గోడలు నిర్మించుకుంటే ఏం జరుగుతుందో ఊహించుకోండని, ఏ పరిశ్రమ ...

Read More »

ప్రధానికి లేఖ రాసిన 150 మంది విద్యావేత్తలు

జెఇఇ, నీట్‌ పరీక్షలపై భారత్‌, విదేశాలలోని వివిధ యూనివర్శిటీల నుండి 150 మందికి పైగా విద్యావేత్తలు ప్రధాని మోడీకి లేఖ రాశాయి. విదేశాలు, మెడికల్‌, ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలైన జెఇఇ, నీట్‌ పరీక్షల నిర్వహణను మరింత ఆలస్యం చేస్తే విద్యార్థులు భవిష్యత్తులో రాజీపడాల్సి వస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలని పలువరు రాజకీయ నేతలు, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వారు స్పందిస్తూ.. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ...

Read More »

పరీక్షలు వాయిదా వేయండి: మమతా బెనర్జీ

విద్యార్థుల క్షేమం దృష్ట్యా జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(ఎన్‌ఈఈటీ–నీట్‌), సంయుక్త ప్రవేశ పరీక్ష (జేఈఈ)- 2020 పరీక్షలను వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో పరిస్థితులు చక్కబడేంత వరకు వేచి చూడాలని కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబరులో నీట్‌, జేఈఈ నిర్వహించాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో మరోసారి నేను కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రమాద తీవ్రతను అంచనా వేసి, పరీక్షలు వాయిదా ...

Read More »

పారదర్శక పన్నుల విధాన వేదిక ప్రారంభించిన మోదీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు ‘పారదర్శక పన్నుల విధాన వేదిక’ ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా మోదీ గురువారం పారదర్శక పన్నుల విధాన వేదిక కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.నిజాయితీగా పన్ను చెల్లించేవారికి ఇలాంటి పారదర్శక వేదికలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. పన్ను సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరం ఉందని మోదీ వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్ను సంస్కరణలు అవసరమని తెలిపారు. కరోనా కష్ట కాలంలోనూ రికార్డు స్థాయిలో ...

Read More »

ఒకే దేశం…ఒకే విద్య విధానం -ప్రధాని మోడీ

ఒకే దేశం.. ఒకే విద్యా విధానం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జాతీయ విద్యా విధానం పై ప్రసంగిస్తూ రాష్ట్రాలన్నీ నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చారు. జాతీయ విద్యా విధానంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సు చదువుకోవచ్చని, పిల్లలు తమ లక్ష్యం చేరుకునేందుకు ఈ విద్యా విధానం సాయం చేస్తోందన్నారు. కొత్త విద్యా విధానంతో విస్తృత ప్రయోజనాలు కలుగుతాయన్నారు. 30 ఏళ్ల తర్వాత కొత్తగా జాతీయ విద్యా విధానం తీసుకువస్తున్నామని ...

Read More »

యువతకు ప్రధాని మోదీ సందేశం

కోవిడ్‌–19 విజృంభిస్తున్న నేపథ్యంలో యువతలో నైపుణ్యానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వాణిజ్య స్థితిగతులు, మార్కెట్‌ రంగంలో అనూహ్య మార్పులు చేసుకుంటున్న వేళ నైపుణ్యం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం, ఇతరుల్ని నిపుణులుగా తీర్చిదిద్దడం అత్యంత కీలకమని యువతకు పిలుపునిచ్చారు. వరల్డ్‌ యూత్‌ స్కిల్‌ డేని పురస్కరించుకొని మోదీ బుధవారం యువతకు వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు. అయిదేళ్ల క్రితం ఇదే రోజున స్కిల్‌ ఇండియా మిషన్‌ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మిషన్‌ ద్వారా గత అయిదేళ్లలో 5 కోట్ల ...

Read More »