వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీపదవులకు కూడా రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి పంపించినట్లు ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో వైయస్ జగన్ భారీ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి కావాలని నిండు మనసుతో కోరుకుంటున్నానని తెలిపారు. నా రాజకీయ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా. శత్రుత్వాలకు, అపార్థాలకు అవకాశం ఇవ్వని విధంగా జీవించాలని వ్యవసాయ ప్రపంచంలో నా మరో ప్రస్థానాన్ని ప్రారంభించానని లేఖలో వెల్లడించారు.