పోలవరంపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టారు మాజీ నీటి పారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు. ఏజెన్సీలు మార్చడం వల్లే పోలవరం ఆలస్యమైందనడం సరికాదన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పోలవరంపై చేసిన అసత్య ఆరోపణలను తిప్పి కొట్టారు. నది డైవర్సన్ చేయకుండానే గతప్రభుత్వం కాఫర్ డ్యామ్ నిర్మించడం తప్పని చెప్పారు. ఆ తప్పు జరగకపోయి ఉంటే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేదేమో అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు మీడియా ముందకు వచ్చి పోలవరం ప్రాజెక్టు పనులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి అనడం సరికాదన్నారు. పోలవరంపై సీఎం చంద్రబాబు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. అలాగే దుర్మార్గపు ప్రచారాలు చేస్తున్నారని ఖండించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు తప్పు జరిగిందా.. లేక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తప్పు జరిగిందా అనేది పూర్తిగా ఇరిగేషన్ శాఖపై అవగాహన ఉన్న వారికే అర్థమవుతుందన్నారు. జగన్ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా పూర్తి చేశామని మనస్పూర్తిగా చెబుతున్నా అన్నారు. దానికి కావల్సిన వివరాలు కూడా చెబుతానన్నారు.
ప్రపంచంలోనే అరుదైన ప్రాజెక్టు పోలవరం..
