నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో ఉదయం 10 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్ లోని కేబినెట్ హాల్లో మంత్రిమండలి సమావేశం కానుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చేసిన ఐదు సంతకాలకు నేడు కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, సామాజిక భద్రతా పింఛన్లు 3000 నుంచి 4 వేలకు పెంపు, ఇతర కేటగిరిలలో కూడా రెండింతలు, మూడింతల పెంపు, రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్‌లకు సంబంధించిన నిర్ణయాలకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడనుంది.
నేడు ఏపీ కేబినెట్ తొలి సమావేశం కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర..!
