చంద్రబాబు ఇప్పుడు కష్టపడుతున్నారని కానీ ఆయన వరదలకు ముందే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈ వరదలు రావడానికి కారణం అక్రమ నిర్మాణాలని అన్నారు. ఇక్కడి పరిస్థితులు చూస్తే గుండె తరుక్కుపోతోందని వరదల కారణంగా ఇన్ని లక్షల మంది ఇళ్లు కోల్పోతారని అనుకోలేదన్నారు. ప్రాణం పోయిన ప్రతి ఒక్కరి కుటుంబాలకు కోటి రూపాయలు చెల్లించాలని, వరద బాధితులకు తక్షణమే ఆహారం, నీరు, ఆశ్రయం అందించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కేంద్రం నుంచి రూ.10 వేల కోట్లు అడిగి తీసుకోవాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
వరదలకు ముందే తగిన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు..
