వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందన్న హోం మంత్రి అనిత ప్రకటనలో ఎలాంటి నిజం లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అన్నారు. పైగా ఆయన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం అన్నివిధాల ప్రయత్నించిందని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైఎస్ జగన్ ములాఖత్ అయిన క్రమంలో ఎక్కడా నియమ నిబంధనల ఉల్లంఘనలు జరగలేదు. అంతా రూల్స్ ప్రకారమే నడుచుకున్నాం. పైగా నిర్ణీత టైం కంటే ముందే ములాఖత్ ముగిసింది. అయితే జగన్‌కు ములాఖత్ ఇచ్చే విషయంలో ఉదారంగా వ్యవహరించామని హోం మంత్రి అనిత చెప్పారు. ఉదారంగా కాదు.. అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
జగన్‌ను అడ్డుకోవాలని అన్నివిధాలా ప్రయత్నించారు..
