భవానీపురం పీఎస్ లో తాజాగా పోసానిపై పోలీసులకు ఫిర్యాదు..

posani-12-.jpg

సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత పోసాని కృష్ణ మురళిపై విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు వైసీపీ హయాంలో పోసాని ఇష్టంవచ్చినట్టు మాట్లాడారని అయితే, తాము పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పోసాని మాట్లాడరని మండిపడ్డారు. సోషల్‌ మీడియా వేదికగా పోసాని చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయన్నారు జనసేన పార్టీ ఆంధ్ర జోన్‌ కన్వీనర్‌ బాడిత శంకర్‌.

ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పంచన చెరి సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు అని ఫైర్‌ అయ్యారు ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, ఆయన కుటుంబ సభ్యులను కూడా కించపరిచేలా మాట్లాడాడు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని మండిపడ్డారు. దీనిపై అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు.

Share this post

scroll to top