మాంసంతో కలిపి గుడ్డు తినకూడదు. చాలా మంది చికెన్, ఫిష్, మటన్‌తో కలిపి గుడ్డు కూడా తింటూ ఉంటారు. బిర్యానీ వంటి వాటితో కూడా గుడ్డు తింటారు. ఈ ఫుడ్ కాంబినేషన్స్ తినడం వల్ల.. జీర్ణ సమస్యలు వస్తాయి. అజీర్తి, గ్యాస్, కడుపులో మంట, ఉబ్బరం వంటి సమస్యల్ని ఎదుర్కొనాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం టీ తాగుతూ ఉంటారు. బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డ తినే అలవాటు ఉంటుంది. అయితే ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత వ్యాధులు, అసిడిటీ, కడుపులో నొప్పి సమస్యలకు దారి తీస్తుంది.
అరటి పండు అంటే చాలా మందికి ఇష్టం. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో అరటి పండు, గుడ్డు కలిపి తింటారు. ఈ రెండూ తినేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఒకటి తిన్న మరో గంటకు తినవచ్చు కానీ.. రెండూ ఒకేసారి కలిపి తీసుకోకూడదు. అరటి పండు, గుడ్డుతో కలిపి పాన్ కేక్స్ వంటివి చేస్తారు. అలా తినడం వల్ల కూడా జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.