Tag Archives: venkatesh

అప్పుడు వెంకటేష్.. ఇప్పుడు నారా రోహిత్

నారా రోహిత్‌ హీరోగా నటిస్తున్న 20వ సినిమాకు సుందరకాండ అనే పేరు పెట్టారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు మేకర్స్. సెప్టెంబర్‌ 6న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. ప్రతి వ్యక్తికి రిలేట్‌ అయ్యేలా కథ ఉంటుందని చెప్పారు. అన్ని రకాల ఎమోషన్స్ ని చూపించామని, తప్పక నచ్చుతుందని అన్నారు మేకర్స్. ఇక అప్పట్లో వెంకటేష సుందరాకాండ సినిమా టైటిల్‌తో ఓ సినిమా వచ్చి మంచి హిట్టుకొట్టింది. ఈ సినిమా కూడా రోహిత్‌కు మంచి హిట్టు ఇవ్వాలనే కామెంట్ నెట్టింట వస్తోంది.

Read More »

CSKవర్సెస్ SRH మ్యాచ్‌లో వెంకీమామతో రేవంత్ రెడ్డి సందడి..

నిన్న ఐపీఎల్ లో CSK వర్సెస్ SRH మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరుగింది. దీంతో మన తెలుగు క్రికెట్ అభిమానులు భారీగా స్టేడియానికి తరలి వెళ్లారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా వెళ్లారు. ఇక క్రికెట్ అంటే విక్టరీ వెంకటేష్ ముందుంటాడు. ఏ క్రికెట్ మ్యాచ్ అయినా వెంకటేష్ కి ఖాళీ ఉంటే దేశంలో ఏ స్టేడియంకి అయినా వెళ్లి చూస్తాడు. అయితే నిన్న హైదరాబాద్ లోనే మ్యాచ్ జరుగుతుండటంతో వెంకటేష్ ఉప్పల్ స్టేడియంకి వేలి సందడి చేసాడు. అయితే ...

Read More »

మళ్ళీ సంక్రాంతి టార్గెట్.. వెంకటేష్ నెక్ట్స్ సినిమా టైటిల్ పీక్స్ ..

విక్టరీ వెంకటేష్ ఇటీవల తన 75వ సినిమా సైంధవ్ తో సంక్రాంతికి వచ్చారు. కానీ ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. వెంకటేష్ నెక్ట్స్ మూవీ అనిల్ రావిపూడి, తరుణ్ భాస్కర్ లతో సినిమాలు చేయాలి. మొదట అనిల్ రావిపూడి సినిమానే చేయబోతున్నట్టు… విరీ కాంబో ఈ సారి కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో సినిమా రాబోతున్నట్టు సమాచారం. గతంలో విరీ కాంబోలో F2, F3 సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. ఇప్పుడు రాబోయే సినిమాని వచ్చే సంక్రాంతికే తీసుకు రాబోతున్నారని ...

Read More »

మరో సారి క్రేజీ హిట్ కాబినేషన్ లో సినిమా..

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల నుంచి తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న త్రిష. కెరియర్ ముగిసిపోయింది అనుకున్న దశలో మరల పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో సత్తా చాటి రేసులోకి వచ్చింది. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది. ప్రెజెంట్ తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. మలయాళంలో మోహన్ లాల్‌ చిత్రంతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ...

Read More »

బీఆర్ఎస్ కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపీ

పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకొన్నారు. సీఎంతో కలిసి కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లిన వెంకటేశ్‌.. అక్కడ వివిధ అంశాలపై వారితో చర్చించారు. మరోవైపు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

Read More »

“F3” ఫన్ స్టార్ట్..స్పెషల్ లుక్ లో వెంకటేష్

 విక్టరీ వెంకటేష్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలుపుతూ “ఎఫ్ 3” మేకర్స్ సరికొత్త వీడియోను విడుదల చేశారు. వెంకటేష్ తన చుట్టూ ఉన్న వ్యక్తులతో చార్మినార్ ముందు విశ్రాంతి తీసుకుంటూ కనిపించడంతో రాజులా రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్ సంస్కృతిని కన్విన్సింగ్‌గా ప్రదర్శించారు. స్పష్టంగా చిత్రంలోని ఒక పాట నుండి ఈ వీడియో క్లిప్ ను విడుదల చేసినట్టు కన్పిస్తోంది. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “ఎఫ్ 3” చిత్రం నుంచి ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియోను విడుదల చేశారు. మేకర్స్ వెంకటేష్ కు ...

Read More »

వెంకటేష్ ‘దృశ్యం 2’ ట్రైలర్

‘విక్టరీ’ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ”దృశ్యం 2”. ఇది మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. సూపర్ హిట్ ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్. మలయాళ డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ థ్రిల్లర్ చిత్రానికి దర్శకత్వం వహించారు. మాతృక బాటలో థియేట్రికల్ స్కిప్ చేసి ఓటీటీలో విడుదల అవుతోంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 25 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

Read More »

ఓటీటీలో విడుద‌ల‌వుతున్న నార‌ప్ప

టాలీవుడ్‌ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్‌ నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. ఈ మూవీ తమిళ హీరో ధనుష్‌ నుటించిన అసురన్‌ చిత్రానికి రీమేక్‌గా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. అయితే కరోనా పరిస్థితుల రీత్యా.. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీ బాట పట్టింది. మంగళవారం ఈ మూవీ అమెజాన్‌ప్రైమ్‌ వీడియోలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర సహ నిర్మాత, వెంకటేష్‌ సోదరుడు దగ్గుబాటి సురేష్‌బాబు మాట్లాడుతూ.. ‘తమిళంలో అసురన్‌ చిత్రం చూసిన వెంటనే నాకు బాగా ...

Read More »

వెంకీ ‘నారప్ప’ ట్రైలర్‌ విడుదల

విక్టరీ వెంకటేష్‌, సెన్సిబుల్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో రూపొందిన తాజా మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘నారప్ప’. డి.సురేష్‌బాబు, కలైపులి యస్‌ థాను సంయుక్తంగా నిర్మించిన ‘నారప్ప’ చిత్రం ఈ నెల 20 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ రోజు (జూలై 14)న ‘నారప్ప’ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్‌. ‘నీదైన దాని కోసం పోరాటం చెయ్యి.. సరైన సమయంలో..’ అంటూ ‘నారప్ప’ ట్రైలర్‌ను షేర్‌ చేశారు విక్టరీ వెంకటేష్‌. ”నారప్ప’ ట్రైలర్‌ కసిగా ఉంది” అని ట్వీట్‌ చేశారు రానా. ...

Read More »

‘నార‌ప్ప’ ఫ్యామిలీ పోస్ట‌ర్.

వెంక‌టేశ్ ప్రధాన పాత్రలో న‌టిస్తున్న ‘నార‌ప్ప‌’ చిత్రానికి సంబంధించి తాజాగా ఉగాది స్పెషల్ పోస్టర్ విడుదలైంది.  శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం  పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ఇప్పటికే మంచి స్పంద‌న వ‌చ్చింది.  వెంకటేశ్ నార‌ప్ప‌గా ఒక వెరైటీ లుక్ తో క‌నిపిస్తూ.. త‌న కుటుంబంతో క‌లిసి న‌డుస్తున్న పోస్టర్ వెంకటేశ్ అభిమానులకు  ఉగాది కానుక అని చెప్పొచ్చు.  వెంకటేశ్ కు జంటగా నటిస్తోన్న  ప్రియ‌మ‌ణి… తన కూతురిని ప‌ట్టుకుని ఉండ‌గా.. వెన‌క‌వైపు కార్తీక్ ర‌త్నం, రాజీవ్ క‌న‌కాల క‌నిపిస్తున్నారు. ఉగాది శోభ ఉట్టిప‌డేలా ...

Read More »