నవంబర్‌లో బ్యాంకులకు 8 రోజుల సెలవులు

నవంబర్‌ నెలలో దీపావళి, గురునానక్‌ జయంతి పండుగల సందర్భంగా.. దేశంలోని అన్ని ప్రైవేటు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులకు 8 రోజుల సెలవులను అధికారులు ప్రకటించారు. పబ్లిక్‌ హాలిడేలతోపాటు పండుగల నేపథ్యంలో.. బ్యాంకులకు 8 రోజులపాటు మూతపడనున్నాయి. నవంబరు నెలలో అయిదు ఆదివారాలు, రెండు శనివారాలు రావడంతో బ్యాంకులకు సెలవు అని, దీంతోపాటు దీపావళి, గురునానక్‌ జయంతి సందర్భంగా ఉన్న సెలవులను ప్రకటించారు. నవంబరు నెలలో బ్యాంకులు 8 రోజులు మూతపడనున్నాయని, ఖాతాదారులు సెలవు రోజుల్లో ఆన్‌లైన్‌, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలను వినియోగించుకోవాలని బ్యాంకు అధికారులు సూచించారు.