Monthly Archives: May 2021

నాలుగు భాషల్లో జెట్టి

సుబ్రహ్మణ్యం పిచ్చుకను దర్శకుడిగా పరిచయం చేస్తూ వేణుమాధవ్‌ నిర్మించిన చిత్రం ‘జెట్టి’. ఇది హార్బర్‌ బ్యాక్‌ డ్రాప్‌లో రూపొం దించిన సినిమా అని నిర్మాత చెప్పారు. ఈ మూవీ టైటిల్‌ లోగోను ఇటీవల తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రం బృందం విడుదల చేసింది. ఇప్పటివరకు రాని సముద్రపు నేపథ్య చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చేయబోతున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Read More »

హీరో రామ్‌ కుటుంబంలో విషాదం

హీరో రామ్‌ పోతినేని కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్‌ తాతయ్య మంగళవారం కన్నుమూశారు. కుటుంబం కోసం తన తాతయ్య ఎంతో శ్రమించారని రామ్‌ అన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ భావోద్వేగ ట్వీట్‌ పెట్టారు.

Read More »

దయచేసి ఈ జాగ్రత్తలు పాటించండి..చిరంజీవి

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో నటుడు చిరంజీవి దీనిపై ట్వీట్‌ చేశారు. ‘ఈ వైరస్‌ నుంచి కోలుకోవడానికి చాలా టైమ్‌ పడుతోంది. అలక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటినుంచి బయటకు రాకండి. తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి. వీలైతే డబుల్‌ మాస్క్‌ వేసుకోండి. వాక్సినేషన్‌ తీసుకోండి. దీనివల్ల కరోనా సోకినా ప్రభావం తక్కుగా ఉంటుంది. పాజిటివ్‌ వచ్చినా పానిక్‌ కావొద్దు. మన భయమే మనలను చంపుతోంది. పాజిటివ్‌ వస్తే ఐసోలేషన్‌లోకి వెళ్ళి డాక్టర్‌ పర్యవేక్షణలో మందులు వాడండి. నలత, ఊపిరి సమస్యలు ...

Read More »

రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన ఎన్టీఆర్‌

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రంజాన్‌ పండుగ సందర్భంగా.. అభిమానులకు, శ్రేయోభిలాషులకు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆయన కరోనాబారినపడి హోం ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే రంజాన్‌ విషెతోపాటు తన ఆరోగ్యం గురించి కూడా చెప్పుకొచ్చారు. ‘అందరికీ ఈద్‌ శుభాకాంక్షలు.. అలాగే మీ స్పెషల్‌ గ్రీటింగ్స్‌ అండ్‌ ప్రేయర్లకు థ్యాంక్యూ. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. త్వరలోనే నెగటివ్‌ వస్తుందని నమ్మకంతో ఉన్నాను. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్‌…ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో కొమరం భీమ్‌ పాత్రలో నటిస్తున్నారు. ...

Read More »

సోనూసూద్‌ ‘ఆక్సిజన్‌ ప్లాంట్లు’

కరోనా సెకండ్‌ వేవ్‌ దెబ్బకి ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీంతో బెడ్స్‌తో పాటు ఆక్సిజన్‌ కొరత వేధిస్తోంది. దీంతో హీరో సోనూసూద్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కోవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ ప్లాంట్లను నెలకొల్పాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఫ్రాన్స్‌ నుంచి ఓ ప్లాంట్‌కు ఆర్డర్‌ చేశామని, మరో 10-15 రోజుల్లో అక్కడ నుంచి ఆక్సిజన్‌ ప్లాంట్‌ రాబోతున్నట్లుగా సోనూసూద్‌ తెలిపాడు. ఇంకొన్ని దేశాల నుంచీ ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా ఆయన ప్రకటించాడు.

Read More »

నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌కు అస్వస్థత

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన స్థానిక అంజిగరైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో చేరారు. మన్సూర్‌ అలీఖాన్‌ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. కరోనా పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన మూత్ర పిండాల్లో రాళ్ళు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కారణంగానే మన్సూర్‌ అలీఖాన్‌ అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు ఆయనకు శస్త్ర చికిత్స చేయనున్నారు.

Read More »

11న ఒటిటిలో నిజల్‌

నయనతార కొత్త చిత్రం ఒటిటి విడుదలకు సిద్ధమైంది. ఆమె తాజాగా నటించిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ ‘నిజల్‌’. ఈ చిత్రంలో నయనతారతో పాటు చాకో బోబన్‌ ప్రధాన పాత్రలో నటించారు. సైజు కురుప్‌, దివ్య ప్రభ, రోనీ డేవిడ్‌ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. అప్పు ఎన్‌ భట్టతిరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘నిజల్‌’ చిత్రం మే 11న ‘సింప్లి సౌత్‌’ అనే ఒటిటి వేదికపై విడుదల కానుంది.

Read More »

జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్

కరోనా సెకండ్‌ వేవ్‌లో సామాన్యులే కాదు..ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇటు చిత్రపరిశ్రమనూ కోవిడ్‌ వెంటాడుతోంది. పవన్‌ కళ్యాణ్‌, అల్లుఅర్జున్‌, కళ్యాణ్‌దేవ్‌ వంటి స్టార్‌ హీరోలను కోవిడ్‌ తాకింది. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇటీవల చేయించుకున్న పరీక్షల్లో కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను బాగానే ఉన్నాని తెలిపారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నానని, వైద్యుల సలహాలు తీసుకుంటున్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసి వారు పరీక్షలు ...

Read More »

నమిత ఓటీటీ థియేటర్‌

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ రవివర్మతో కలసి ‘నమిత థియేటర్‌’ అనే ఒటిటి ప్లాట్‌ఫామ్‌ను అందుబాట్లోకి తీసుకురానున్నట్టు హీరోయిన్‌ నమిత ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో కథానికలు, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన సినిమాలను ప్రదర్శిస్తామని  తెలిపింది. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువ దర్శకులకు  తక్కువ బడ్జెట్లో సినిమాలు నిర్మించాలనుకునే వారికి దీనినొక వేదికగా మారుస్తానంటోంది నమిత.

Read More »

అంధ గాయకుడు కోమగన్‌ మృతి

అంధ గాయకుడు, స్వరకర్త, రాగప్రియ ఆర్కెస్ట్రా వ్యవస్థాపకుడు ఎం.జె.సి. కోమగన్‌ (48) అనారోగ్యంతో కన్నుమూశారు. చేరన్‌ దర్శకత్వం వహించిన తమిళచిత్రం ‘ఆటోగ్రాఫ్‌’ మూవీలో అంధ గాయనీ గాయకులు, వాద్యకారులపై ఓ పాటను చిత్రీకరించారు. కథానాయిక స్నేహ వారి తో కలిసి అందులో ఓ పాట పాడుతుంది. తెలుగు లోనూ ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’ చిత్రంలో భూమిక ఆ పాటలో నటించింది. ‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది..’ అంటూ సాగే ఆ ప్రబోధ గీతం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పాట చిత్రీకరణలో ...

Read More »