బాలీవుడ్‌లో జగపతిబాబు

‘లెజెండ్’ తో రూటు మార్చిన జగపతిబాబుకు ఆ తర్వాత వెనుదిరిగి చూసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత విలన్ గా, సహాయనటుడుగా దక్షిణాది చిత్రాలన్నింటిలో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు జగపతి బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. బాలీవుడ్ మూవీ ‘పుకార్‌’లో విలన్ గా నటించబోతున్నాడు జగపతిబాబు. ‘లగాన్’ ఫేమ్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఫర్హాన్ అక్తర్ హీరోగా నటిస్తున్నారు. ఫర్హాన్ తండ్రి జావేద్ అక్తర్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాస్తున్నారు. రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తోంది. అడవిని సంరక్షించే ఫారెస్ట్ రేంజర్ పాత్రలో కనిపించబోతున్నాడు పర్హాన్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమవుతుంది. జగపతి బాబు మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు. సీనియర్ నటుడు ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వం వహించిన మహా సముద్రంలో కనిపించాడు. జగపతిబాబు ఇటీవల ‘మహా సముద్రం’లో చుంచు మామ పాత్రలో కనిపించారు.