కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మలయాళీ సీనియర్ స్టార్ మోహన్‌లాల్ కు విందునిచ్చారు. స్నేహానికి ఎల్లలు లేవంటూ… వారంతా ఓ మినీ పార్టీ చేసుకున్నారు. ఈ ఫొటోలన్నీ మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈమధ్య మలయాళ చిత్రాల షూటింగ్‌లు ఎక్కువగా హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. మలయాళీ నటులు కూడా అప్పుడప్పుడు తెలుగు వెండితెరపై కనులవిందు చేస్తున్నారు. మోహన్ లాల్ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. మమ్ముట్టి అయితే ‘యాత్ర’ చిత్రంలో నటించారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించే మలయాళ చిత్రాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌లో జరుగుతూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘లూసిఫర్’ తర్వాత డైరెక్ట్ చేస్తున్న సెకండ్ మూవీ ‘బ్రో డాడీ’ షూటింగ్ హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.