Author Archives: News

చింత చిగురులో అద్భుత పోషకాలు.. థైరాయిడ్ సమస్యను కూడా తగ్గిస్తుందట..

చింత చిగురు.. తీపి, పులుపు, ఒగురు మిళతమై ఉండే అద్భుతమైన పోషకాలు కలిగిన ఆకు కూరగా దీనిని పేర్కొనవచ్చు. అయితే ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. సీజనల్ వైజ్‌గా లభిస్తుంది. సంవత్సరానికి రెండు లేదా మూడు సార్లు చింత చెట్లు పూత దశకు వస్తుంటాయి. ఈ దశకు ముందు పాత ఆకులు రాలిపోతూ.. కొత్త ఆకులు చిగురిస్తుంటాయి. వీటినే చింత చిగురుగా పేర్కొంటారు. పప్పులో, వంకాయల్లో, నాన్ వెజ్‌లో కలిపి వండుకుని తింటుంటారు. అయితే ఇందులో అనేక పోషకాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదని ...

Read More »

బేబీ జాన్ కొత్త పోస్టర్ రీలిజ్..

బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావన్ ప్ర‌ధాన పాత్ర‌లో వ‌స్తున్న తాజా చిత్రం బేబీజాన్. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ , వామిక గ‌బ్బి క‌థ‌నాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. కోలీవుడ్ ద‌ర్శకుడు కాలీస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఇదిలావుంటే.. నీన్న వ‌రుణ్ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా మూవీ టీమ్ విషెస్ తెలుపుతూ.. కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. మరిచిపోలేని సరికొత్త అనుభవాన్ని అందించేందుకు ...

Read More »

కన్నడ పరిశ్రమలోకి AMB సినిమాస్..

మహేష్ బాబు సినిమాలో పాటు యాడ్స్, బిజినెస్ లు కూడా చేస్తూ బీజీ గా ఉంటారు. గతంలో మహేష్ మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఏషియన్ సినిమాస్ తో కలిసి హైదరాబాద్ లో AMB సినిమాస్ అని స్థాపించారు. ఈ మల్టీప్లెక్స్ బిజినెస్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. దీంతో ఇప్పుడు బెంగుళూరులో కూడా AMB సినిమాస్ ని నిర్మిస్తున్నారు. బెంగళూరులోని గాంధీనగర్ లో ఉన్న కపాలి థియేటర్ కర్ణాటకలోనే అతిపెద్ద థియేటర్. కానీ నష్టాలు రావడంతో ఈ థియేటర్ 2017లో ...

Read More »

వరల్డ్ మలేరియా డే.. దోమలు ఎవరిని ఎక్కువ కుడతాయి..?

ఎవరైనా సరే ఎక్కువగా భయపడేది అంటువ్యాధులకే. ముఖ్యంగా దోమలతో వ్యాపించే అంటు వ్యాధి మలేరియా అంటే చాలా మందికి భయం ఉంటుంది. మలేరియా దోమల వలన వచ్చే ఓ అంటువ్యాధి. దీని వలన చాలా మంది మరణిస్తున్నారు. దీంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25న మలేరియా పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు. ఇక మలేరియా బారిన పడిన వారిని కుట్టిన దోమ మనల్ని కుడితే ఆ జ్వరం వచ్చేస్తుంది. అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమల్లో ప్లాస్మోడియం వైవాక్స్ అనే ప్రోటోజోవా ఉంటుంది. ...

Read More »

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల రద్దుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పై దుష్ర్పచారం చేసి ఎలాగైనా గెలవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనపై గురువారం గాంధీభవన్ లో చార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…మోదీ సర్కార్ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయి పనిచేస్తుందన్నారు. గత ప్రధానులందరూ కలిసి రూ.54 లక్షల కోట్ల అప్పులు చేస్తే ప్రధాని ...

Read More »

శ్రీశైలం వెళ్తున్నారా బీ అలర్ట్..!

యూజ్‌ చేయడానికి ప్లాస్టిక్ ఎంత కన్వినియంటో దాన్ని వదిలించుకోవడం అంత కష్టం. మన పర్యావరణానికి ప్లాస్టిక్‌ ఎంతటి పెనుముప్పుగా మారిందో మన కళ్లెదుటే కనిపిస్తోంది. ప్లాస్టిక్‌ వినియోగాన్ని మానుకోవాలని, తగ్గించుకోవాలని ప్రభుత్వాలు ఎంతగా చెప్తున్నా వదిలించుకోలేని పరిస్థితి. అయితే ప్లాస్టిక్‌ భూతాన్ని తరిమికొట్టేందుకు శ్రీశైలం దేవస్థానం, అటవీ శాఖ అధికారులతో కలిసి కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, మూగ జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించగా.. ప్లాస్టిక్ నిషేధాన్ని ...

Read More »

నేడు సింగర్ అరిజిత్ సింగ్ పుట్టినరోజు

సింగర్ అరిజిత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన పాటలతో యువతను నవ్వించగలడు అలాగే ఏడిపించగలడు. అతని పాటలు మన మనసును టచ్ చేస్తాయి. అరిజిత్ సింగ్ పాడిన ఏ పాట అయినా.. అది నిముషాల్లోనే వైరల్ అవుతుంది. పాటలు పాడటం మాత్రమే కాకుండా సంగీతాన్ని కూడా సినిమాలకి అందించాడు. మెలోడీల నుండి ఎనర్జిటిక్ గా మారే మ్యాజిక్ అతనికి మాత్రమే తెలుసు. అతను రియాలిటీ షో ఫేమ్ గురుకుల్‌లో కనిపించారు. ఆ తర్వాత 2011లో మర్డర్ 2 చిత్రం నుండి ...

Read More »

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో చేరనున్న కీలక నేత

ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. గురువారం పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈక్రమంలో సీఎం జగన్ పులివెందులలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సభలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా కమలాపురం లో టీడీపీకి షాక్ తగిలింది. ఇవాళ పులివెందులలో సీఎం జగన్ సమక్షంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. కాగా, కమలాపురం టికెట్ ఆశించి భంగపడ్డ వీర శివారెడ్డి తెలుగుదేశం ...

Read More »

‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో వ‌చ్చేసింది !

అల్లు అర్జున్‌, సుకుమార్ కాంబోలో వ‌చ్చిన ‘పుష్ప’ ది రైజ్‌ చిత్రం ఎంత‌టి ప్ర‌భంజ‌నం సృష్టించిందో తెలిసిందే. ప్ర‌స్తుతం ఈ మూవీకి సీక్వెల్‌గా ‘పుష్ప‌-2’ ది రూల్ తెర‌కెక్కుతోంది. ఇటీవల బ‌న్నీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది. ఆ టీజర్‌కు మంచి స్పందన వ‌చ్చింది. టీజర్‌ విడుదలైనప్పటి నుండి నాన్‌స్టాప్‌గా 138 గంటల పాటు యూట్యూబ్‌లో నం.01 ట్రెండింగ్‌లో ఉండి కొత్త రికార్డు నెలకొల్పిది. ఇక తాజాగా ‘పుష్ప-2’ ది రూల్‌ కొత్త అప్‌డేట్‌ వచ్చేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ...

Read More »

పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్

మేమంతా సిద్ధం బస్సుయాత్రను బుధవారంతో ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా గురువారం పులివెందులలో పర్యటించారు. అనంతరం అక్కడ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. తొలుత పులివెందులలోని సీఎస్ ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడ్నుంచి నేరుగా రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జగన్ నామినేషన్ వేశారు. నామినేషన్ పత్రాలను పులివెందుల ఆర్. ఓ కు అందజేశారు. అంతకుముందు పులివెందులలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. తన ...

Read More »