Author Archives: News

గన్‌పార్క్ వద్ద హైటెన్షన్.. రాజీనామా లేఖతో వచ్చిన హరీష్ రావు

హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటనతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. హరీష్ రావు రాక నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా తరలివస్తున్నారు. దీంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. గన్‌పార్క్ వద్దకు ఎవరూ రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హరీష్ రావు రాజీనామా లేఖతో చేరుకున్నారు. ఆయనతో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పలువురు కీలక నేతలు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తూ రాజీనామా లేఖతో ...

Read More »

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 8 గంటలు సమయం, ప్రత్యేక దర్శనానికి 3 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని 61,492 మంది భక్తులు దర్శించుకోగా, తలనీలాలు 27,660 మంది సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.72 కోట్లు.

Read More »

ప్రధాని మోడీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇదే..

ప్రధాని నరేంద్ర మోడీ ఆధప్రదేష్ లో పర్యాటనకు సీద్దం అయ్యాడు. మే 3వ తేదీన పీలేరు, విజయవాడలో ఆయన పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 3న మధ్యాహ్నం 2:45కి పీలేరు, సాయంత్రం 6:30 కు విజయవాడలో రోడ్ షో నిర్వహించనున్నారు. 4న మధ్యాహ్నం 3:45కి రాజమండ్రి, సాయంత్రం 6 గంటలకు అనకాపల్లిలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు పాల్గొంటారని తెలుస్తోంది.

Read More »

జగన్ కోసం జనంలోకి భారతి..

జగన్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న నేపథ్యంలో పులివెందులలో ప్రచార బాధ్యతలు జగన్ సతీమణి వైఎస్ భారతి తీసుకోనున్నారని సమాచారం అందుతోంది. స్థానిక వైసీపీ నేతలతో కలిసి భారతి ప్రచారం నిర్వహిస్తారని సమాచారం అందుతోంది. 2014, 2019ఎన్నికల్లో కూడా జగన్ తరఫున భారతి పులివెందులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భారతితో పాటు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

Read More »

చంద్రబాబు ట్వీట్ పై ఘాటుగా స్పందించిన సజ్జల

ఇవాళ పులివెందులలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తోడబుట్టిన చెల్లెలి పుట్టుకపైనా… మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం… ఇది వికృత మనస్తత్వం కాదా? అని చంద్రబాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృత ఆలోచనలు చూస్తే మీరు ఎంతగా ...

Read More »

సీఎం జగన్ ప్రచార షెడ్యూల్

ఈనెల 28 నుంచి సీఎం జగన్ ప్రతి రోజూ 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులో జరిగే సభల్లో జగన్ ప్రసంగిస్తారు. 30న కొండపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో పాల్గొంటారు.

Read More »

రెండో రోజు ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర రెండో రోజు ప్రారంభమైంది. సూర్యాపేట నుంచి కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. సాయంత్రం భువనగిరిలో రోడ్డు షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. సూర్యాపేట నుంచి భువనగిరి వచ్చే మార్గమధ్యలో అర్వపల్లి, తిమ్మాపూర్ తదితర ప్రాంతాల్లో కేసీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ శ్రేణులు పూలవర్షం కురిపించాయి. కేసీఆర్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. జనగాం మీదుగా కేసీఆర్ భువనగిరి చేరుకుంటారు. సాయంత్రం ఆరు గంటలకు భువనగిరిలో బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు ...

Read More »

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ కీలక వ్యాఖ్యలు

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై నిర్మాణ సంస్థలతో పాటు అవసరమైతే సంబంధిత రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇస్తామని కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ అన్నారు. అవసరమైతే కేసీఆర్‌ను పిలిచి ఈ ప్రాజెక్టుపై తమకు కావాల్సిన సమాచారం సేకరిస్తామన్నారు. ఆయన గురువారం హైదరాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రెండు రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇచ్చి ఆ తర్వాత దీనిపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపడతామన్నారు. నిపుణుల అభిప్రాయాలు తీసుకొని విచారణ జరుపుతామన్నారు. ఎన్డీఎస్ఏ, ...

Read More »

కల్కి సెట్స్‌లోని విజయ్ దేవరకొండ పిక్ వైరల్..

టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి లో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే వచ్చాయి. కానీ వాటిలో ఎంత నిజముంది అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. అయితే తాజాగా బయటకి వచ్చిన ఓ ఫోటో చూసిన తరువాత కల్కిలో విజయ్ గెస్ట్ రోల్ కన్ఫార్మ్ అని తెలుస్తుంది. రీసెంట్ గా కల్కి మూవీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ పుట్టినరోజు జరిగింది. ఇక ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ ని కల్కి ...

Read More »

సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..!

సోయాబీన్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో సులభంగా బరువు తగ్గవచ్చు. ఎందుకంటే ఇది మీ శరీరానికి సరైన ఎదుగుదలకు అవసరమైన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఇదీ కాకుండా, సోయాబీన్స్ బరువు తగ్గడంలో మీకు సహాయపడే అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. సోయాబీన్స్‌ను తీసుకోవడంతో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సోయాబీన్స్‌ తినడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. నిద్ర లేమి సమస్యలు దూరమవుతాయి. ఎముకలను బలంగా మార్చడంలో సోయా బీన్స్‌ సహాయపడతాయి. ముఖ్యంగా ...

Read More »