కరోనా నివారణపై మంత్రివర్గ సమావేశం మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్ 6వ ఫ్లోర్‌లో గురువారం జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గ్రూప్ అఫ్ మినిస్టర్స్ కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన సమావేశం జరిగింది. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్స్‌పై కర్ఫ్యూ అమలు జరుగుతున్న తీరు పలు అంశాలపై మంత్రుల కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా కరోనా కష్ట కాలంలో ప్రాణాలు తెగించి రోగులకు వైద్య సేవలు ...
Read More »Tag Archives: ap cabinet meeting
నేడు ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి నేడు (బుధవారం) సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై చర్చించనున్నారు. దాంతోపాటు ఇసుక కార్పొరేషన్ ఏర్పాటుపైనా మంత్రి మండలి నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు పనులకు ఆమోదం తెలిపే అవకాశముంది. రాయలసీమ కరువు నివారణ కు ప్రాజెక్టుల నిర్మాణ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
Read More »ఈ నెల 15న ఏపీ కేబినెట్ భేటీ
ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం కానుంది. వెలగపూడిలోని సచివాలయంలో వచ్చే బుధవారం జరిగే కేబినెట్ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కోవిడ్ నియంత్రణ చర్యలపై మంత్రి మండలి చర్చించనున్నట్టు సమాచారం. ఇక గత నెల 11న జరిగిన భేటీలో వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలకు కేబినెట్ ఆమోదం వేసిన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇళ్లపట్టాలు, గృహనిర్మాణాల మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులకు, గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో ...
Read More »నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో జరగనుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భౌతిక దూరం పాటించేలా సీట్లను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణతో పాటు పలు ముసాయిదా బిల్లు లపై ఇందులో చర్చించనున్నారు. మరికొన్ని ఎన్నికల హామీలకు కేబినెట్‌లో ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.
Read More »ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి బుధవారం ఉదయం సమావేశమైంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగులు ఇవ్వాలని కేబినెట్ భేటీలో ప్రతిపాదించనున్నారు. దీనిలో భాగంగా విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోటు పుస్తకాలు ఇవ్వనున్నారు.
Read More »