Tag Archives: corona virus

మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా

రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. కాగా,నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ...

Read More »

భారత్‌లో కొత్తగా 47,704 కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి వేగంగా విస్తరిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు, మరణాలు వెలుగుచూస్తున్నాయి. దీంతో దేశంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 47,704 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 654 మంది కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 14,83,157కు చేరింది. ఇప్పటి వరకు 33,425 మంది మృత్యువాత పడగా.. 9,52,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. సోమవారం మొత్తం 5,28,082 కరోనా నిర్ధారణ పరీక్షలు ...

Read More »

కోవాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ షురూ!

దేశంలో కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 10 లక్షల మార్క్‌ను దాటేసింది. ఈ క్రమంలో హర్యానా ఆరోగ్య శాఖా మంత్రి అనిల్‌ విజ్‌ శుక్రవారం కాస్త ఊరటనిచ్చే కబురు చెప్పారు. భారత్‌ బయోటెక్‌ అభివృద్ది చేసిన కరోనా విరుగుడు టీకా కోవాక్సిన్‌ హ్యూమన్‌ ట్రయల్స్‌ ఈ రోజు ప్రారంభమైనట్లు తెలిపారు. రోహతక్‌లోని పీజీఐ (పండిత్‌ భగవత్‌ దయాళ్‌ శర్మ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో ముగ్గురిపై టీకా ప్రయోగించగా.. వారంతా బాగానే ...

Read More »

24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు

24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరుగుతోంది. పాజిటివ్‌ కేసులు 9 లక్షలకు, మరణాలు 23 వేలకు చేరువవుతున్నాయి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 551 మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. దీంతో దేశంలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 8,49,533కు, మరణాలు 22,674కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 5,34,620 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,92,258. మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో 2,46,600 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ...

Read More »

భారత్‌లో లక్షా 50వేలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 కరోనా కేసులు నమోదు కాగా, 170 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,51,767కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 64,425 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,337 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 83,004 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Read More »

ఏపీలో కొత్తగా మరో 44 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,671కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 10,240 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 44 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపింది

Read More »

భారత్‌లో లక్షా ముప్పైవేలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో రికార్డు స్థాయిలో 6,767 కరోనా కేసులు నమోదు కాగా, 147 మంది మృతిచెందారు. ఒక్క రోజు వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,31,868కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు 54,440 మంది కరోనా నుంచి కోలుకోగా, 3,867 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 73,560 ...

Read More »

ఏపీలో మరో 57 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 57 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2339కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో 9,739 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 57 మందికి పాజిటివ్‌ నిర్దారణ అయిందని తెలిపింది. ఈ రోజు ఒక్కరోజే 69 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారని, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోరి చొప్పున మృత్యువాత పడ్డారని పేర్కొంది. కాగా, ఇ‍ప్పటి ...

Read More »

జాతినుద్దేసించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

జాతినుద్దేసించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. కోవిడ్ -19 (కరోనా వైరస్) విస్తరిస్తున్న వైనం, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్ డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని జాతికి సందేశాన్ని ఇవ్వనున్నారు. కోవిడ్ -19కి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై మార్చి 24 (మంగళవారం) సాయంత్రం 8 గంటలకు ఆయన సందేశాన్ని ఇవ్వనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిపై ముఖ్యమైన విషయాలను పంచుకుంటాను అంటూ ప్రధాని మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటనను సీరియస్ తీసుకోవడం లేదంటూ ప్రధాని ...

Read More »

కరొనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు

కరొనపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వ తాజా ఆదేశాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కోవిడ్‌–19ని మహమ్మారిగా ప్రకటించడంతో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో జీవో జారీ చేసింది. అవి.. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టుల వద్ద స్క్రీనింగ్‌ చేయాలి. సాధారణ సమావేశాలు వాయిదా. అత్యవసర సమయంలోనే సమావేశాలు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి వ్యాధి నిరోధానికి ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రజారవాణా వాహనాలు, ప్రైవేటు వాహనాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల మూసివేత. అత్యవసర సేవలు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. నిత్యావసరాలను ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు. జిల్లాల కలెక్టర్లు ధరలు నిర్ణయిస్తారు. అధిక ...

Read More »