Tag Archives: sharmila

హ్యాపీ బర్త్ డే అమ్మా: జగన్, షర్మిల

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మ జన్మదినం నేడు. ఈ సందర్భంగా తన తల్లికి జగన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా’ అని ట్వీట్ చేశారు. ఓ కార్యక్రమంలో తన తల్లితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ ...

Read More »

షర్మిల వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన అవినాశ్ రెడ్డి

వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా… దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మాట్లాడుకోవాలంటే అంత మాట్లాడుకోండి… నాకెలాంటి అభ్యంతరం లేదు… ...

Read More »

పార్లమెంట్ ఎన్నికల బరిలో షర్మిల..

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు తెరపడింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కడప సిట్టింగ్ ఎంపీ, ఆమె సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని షర్మిల ఢీకొట్టనున్నారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఇవాళ జరిగిన సీఈసీ మీటింగ్‌లో ఏపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై చర్చించిన అనంతరం క్యాండిడేట్లను ఫైనల్ చేశారు. మరో 58 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించకుండా కాంగ్రెస్ హోల్డ్‌లో పెట్టింది. ...

Read More »

కడప నేతలతో నేడు షర్మిల భేటీ.. కీలక ప్రకటన వెలువడే అవకాశం!

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈరోజు కడప నేతలతో భేటీ అవుతున్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో సమావేశం జరగబోతోంది. జిల్లాలోని అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించనున్నారు. అంతేకాదు, తాను ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారో షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కడప నుంచి పోటీ చేయడానికి షర్మిలకు పార్టీ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కడప ...

Read More »

నేడే ఏపీలో CM రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఏపీ కాంగ్రెస్ తలపెట్టిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి రాకను స్వాగతిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న ఉక్కు తెలంగాణ ఉద్యోగుల సంక్షేమ సంఘం భారీగా బ్యానర్లు, కటౌట్లు కట్టింది. సభాస్థలి ప్రాంగణం సమీపంలో కట్టారు. ఉక్కు కర్మాగారంలో తెలంగాణకు చెందిన ఉద్యోగులు సుమారు వెయ్యి మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నట్టు సంఘం ప్రధాన కార్యదర్శి జి.ఆనంద్ తెలిపారు. ఇవాళ ...

Read More »

షర్మిళ బాధితుల ప్రెస్ మీట్..!

తెలంగాణ లో మొరుసుపల్లి షర్మిల వల్ల మోసపోయిన మాజీ YSRTP నాయకులు ప్రెస్ మీట్ పెట్టేందుకు విజయవాడ వస్తే… నా ఆఫీసు పై దాడి చేసేందుకు 50 మంది వచ్చారు అని తప్పుడు పిర్యాదు చేసి 26 మందిని సూర్యారావు పేట పోలీసు స్టేషన్ లో కూర్చోబెట్టిస్తావా అని ప్రశ్నించారు. నేను ఏ తప్పు చేయలేదు అని భావిస్తున్న నువ్వు ఇంత భయపడుతూ బ్రతుకుతున్నావెంటి మొరుసుపల్లి షర్మిల శాస్త్రి అని విమర్శించారు.

Read More »

అంత సీన్ లేదు.. షర్మిలపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వ్యూహం’ సినిమాకు సంబంధించి ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. షర్మిల పాత్ర ‘వ్యూహం’ సినిమాలో ఉంటుంది కానీ ఏం చేయరన్నారు. రియల్ లైఫ్ లో కూడా సీఎం జగన్ కు షర్మిల ఏం చేయలేదా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆర్జీవీ బదులిస్తూ.. జగన్ జైలులో ఉన్నప్పుడు.. ఆయనకు బయటకు రావడానికి యాక్సెస్ లేనప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చారన్నారు. ప్రజలు షర్మిలలో జగన్‌ను చూసుకోవడానికే మీటింగ్‌లకు ...

Read More »

షర్మిల వీటికి సమాధానం చెప్పాలి: ఆళ్ల

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలకు పలు ప్రశ్నలు సంధించారు. వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. “వైఎస్ఆర్ మరణాన్ని అవమానించిన రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశావు? వైఎస్ఆర్ను ధ్వేషించిన చంద్రబాబుతో ఎందుకు చేతులు కలిపావు? కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టకుండా.. ప్రతీ మీటింగ్ లో వ్యక్తిగత విమర్శలు ఎందుకు? ఎంగేజ్ మెంట్ కు వచ్చిన అన్నకు గౌరవం ఇవ్వాలన్న జ్ఞానం లేదా? నీ కొడుకు పెళ్లికి అన్నను పిలవాలన్న ఇంగితం లేదా?” అంటూ ఆర్కే విరుచుకుపడ్డారు.

Read More »

జగన్‌ను తిట్టమన్నారు… ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు

మరికొన్ని నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తాజాగా తిరిగి వైసీపీ లో చేరి ఎవరు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇటీవల వైఎస్ షర్మిల తోనే నా ప్రయాణం అంటూ కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆళ్ల రామకృష్ణా రెడ్డి తిరిగి వైసీపీ లో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. వైసీపీ లో చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరిగి వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ...

Read More »

వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డు మీదకు వచ్చారంటూ రోజా కౌంటర్‌

వైఎస్ఆర్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డు మీదకు వచ్చిందంటూ వైఎస్ షర్మిలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని.. వైసీపీ ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందని ఆగ్రహించారు రోజా. తిరుపతిలో ఇవాళ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు మేలు చేయడానికి వైఎస్ఆర్ పేరు షర్మిల వాడుకుంటోందని ఆగ్రహించారు. వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే… వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని నిప్పులు చెరిగారు. వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదని మండిపడ్డారు. ...

Read More »