Tag Archives: trs

టీఆర్ఎస్‌ భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన కేటీఆర్

ఇవాళ భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనం అయిన రోజు. ఈ సందర్భంగా విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ జెండాను ఆవిష్కరించారు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్య్ర సంబరాలు జరుపుకున్నారు. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా ...

Read More »

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా

తెలంగాణలో మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఎమ్మెల్యేకు, కుటుంబ సభ్యులతో పాటు అంగరక్షకులలకు పరీక్షలు చేయించగా మొత్తం ఎనిమిది మందికి పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. ఆయన హైదరాబద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల సురేందర్‌ కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ఇప్పటివరకూ సురేందర్ సహా నలుగురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ తెలింది. కాగా, ఇప్పటికే ముగ్గురు ...

Read More »

శ్రీనివాస్ ఘటనపై స్పందించిన కేటీఆర్

కారుతో సహా వాగులో గల్లంతైన టీఆర్‌ఎస్‌ నేత జంగపల్లి శ్రీనివాస్‌ ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సిద్ధిపేట కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డితో ఫోన్లో మాట్లాడిన మంత్రి.. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ల‌పల్లి టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండ‌గా.. సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాహనంతో స‌హా వాగులో ప‌డిపోయారు. స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని బయటకు తీయగా… కారుతో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు.విషయం ...

Read More »

టీఆర్ఎ‌స్‌ ఎమ్మెల్సి గంగాధర్‌గౌడ్‌కు కరోనా

తెరాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్‌కు కరోనా సోకింది. ఆయనతో పాటు ఎమ్మెల్సీ సతీమ ణి, కుమారుడికి పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అయితే, తమకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగా ఉన్నామని వీజీ గౌడ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో హోం క్వారంటైన్‌లో ఉన్నామని పేర్కొన్నా రు. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్నానని, అక్కడకు వచ్చిన మరో ఎమ్మెల్సీ నిమ్స్‌లో చేరినట్లు తెలియడంతో తనతో పాటు కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకున్నామని వివరించారు. తనతో పాటు సతీమణి, కుమారుడికి పాజిటివ్‌ అని శనివారం ...

Read More »

మాట నిలబెట్టుకున్న కేటీఆర్‌

ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ఆరు కోవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్సులను ప్రభుత్వానికి అందజేశారు. తన జన్మదినం సందర్భంగా ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌’పేరిట ఇచ్చిన నినాదంలో భాగంగా సొంత డబ్బుతో అంబులెన్సులు అందజేస్తున్నట్లు కేటీఆర్‌ వెల్లడించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్‌ అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభించారు. కేటీఆర్‌ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్యతో పాటు పలువురు మంత్రులు, ...

Read More »

సెప్టెంబర్‌ కల్లా బాలానగర్‌ ఫ్లైఓవర్‌ పూర్తి: కేటీఆర్‌

అండర్‌ బ్రిడ్జ్‌తో ఫేతే నగర్‌ బ్రిడ్జ్‌పై రద్దీ తగ్గుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బుధవారం కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘137 కొత్త లింక్‌ రోడ్లు వేస్తున్నాం. ఆర్ యూ బీ వలన ఫేతే నగర్ బ్రిడ్జ్ పై రద్దీ తగ్గుతుంది. దీని వలన 6.5 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తాం. రేపు రెండు లింక్‌ రోడ్లు ప్రారంభిస్తాం. సెప్టెంబర్‌ వరకు బాలా నగర్‌ ప్లై ఓవర్‌ పూర్తి అవుతుంది. రోడ్డు విస్తరణలో ఎక్కవ మొక్కలు నాటాలి. త్వరలోనే నగరంలో లక్ష ...

Read More »

మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా

రాష్ట్ర వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ఎవరినీ వదలడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు కోవిడ్‌ బారినపడి కోలుకోగా తాజాగా మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి బుధవారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌కు వెళ్లారు. కాగా,నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా కరోనాబారినపడి కోలుకున్న సంగతి తెలిసిందే. ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, కుత్బుల్లాపూర్‌ ...

Read More »

స్వీయ నిర్బంధంలో మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత

స్వీయ నిర్బంధంలో మాజీ ఎంపి కల్వకుంట్ల కవిత

నిజామాబాద్‌ మాజీ ఎంపి, ముఖ్యమంత్రి కుమార్తె కల్వకుంట్ల కవిత స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆమె వద్ద పని చేసే డ్రైవర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో వైద్యుల సూచనల మేరుకు ఆమె హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఆమె క్వారెంటైన్‌ పాటిస్తున్నట్లు కవిత సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా తెలంగాణలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 50 వేలు దాటింది.

Read More »

తాగునీటి పథకానికి కేటీఆర్‌ శ్రీకారం

తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) కరీంనగర్‌లో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 24 గంటల తాగునీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ మానేరు తీరంలో మొక్కలు నాటారు. తెలంగాణలోనే రెండో అతిపెద్ద ఐటీ టవర్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌లో నిత్యం తాగునీటిని‌ అందించడం గర్వంగా ఉందన్నారు. ఇక్కడ ప్రారంభించిన ప్రతి పని విజయవంతం అవుతుందని తెలిపారు. 2048 ఏడాది నాటికి సరిపడే విధంగా కార్యక్రమాన్ని చేపట్టామని ...

Read More »

మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు కరోనా

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు ప్రతి ఒక్కరూ వైరస్‌ బారరినపడక తప్పడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజగా కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద్‌గౌడ్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్‌ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. దీంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వివేకానంద్‌ను ‘సాక్షి’ఫోన్‌లో పలకరించగా వైద్యుల సూచన మేరకు 14 రోజులు ...

Read More »