Politics

జగన్ లేకుంటే సచివాలయాలు మూసేస్తారు: ఎంపీ మిథున్ రెడ్డి

జగనన్న ముఖ్యమంత్రిగా లేకపోతే సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆగిపోతాయని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయాలను మూసివేసి జన్మభూమి కమిటీల కార్యాలయాలుగా మార్చేస్తారని, వాలంటీర్లను తొలగిస్తారని అన్నారు. ఎన్నికల వేళ చంద్రబాబు మళ్లీ మోసపూరిత హామీలను ప్రకటిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆయన అమలు చేయలేదని గుర్తు చేసుకోవాలని సూచించారు.

Read More »

అమలాపురం పార్లమెంటు స్థానం వైసీపీ ఇన్చార్జిగా రాపాక వరప్రసాద్

ఏపీ అధికార పక్షం వైసీపీ విడతల వారీగా తన అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇవాళ ముగ్గురి పేర్లతో మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు ఎంపీ స్థానాలకు, ఒక ఎమ్మెల్యే స్థానానికి ఇన్చార్జిలను ప్రకటించారు. అమలాపురం పార్లమెంటు స్థానం వైసీపీ ఇన్చార్జిగా రాపాక వరప్రసాద్ ను ప్రకటించారు. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఈసారి ఎన్నికల్లో రాపాక లోక్ సభకు పోటీ చేస్తున్నందున, రాజోలు అసెంబ్లీ ...

Read More »

పాతబస్తీలో మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాతబస్తీ మెట్రో రైలు మార్గానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ మెట్రోకు ఫరూక్ నగర్ బస్ డిపో వద్ద శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలో మీటర్ల మేర ఐదు స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే సికింద్రాబాద్ నుంచి జేబీఎస్, ఎంజీబీఎస్ మీదుగా పాతబస్తీకి వెళ్లవచ్చు. మెట్రో రైలు మార్గానికి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ ...

Read More »

చంద్రబాబు ఆనాడే లక్ష కోట్ల కుంభకోణానికి స్కెచ్ వేశారు: సజ్జల

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అప్పట్లోనే రూ.లక్ష కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని, అది స్కాంలలోకెల్లా అతిపెద్దదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఐఎంజీ భారత్ సంస్థ పేరిట చంద్రబాబు భారీ స్కెచ్ వేశాడని, కానీ వైఎస్ మంచితనం వల్ల చంద్రబాబు జైలు పాలవకుండా బయటపడ్డారని వెల్లడించారు. చంద్రబాబు ఒక ఇంటర్నేషనల్ స్కామర్ అని, ఐఎంజీ తరహాలోనే అమరావతిలోనూ చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని సజ్జల వివరించారు. “నారా చంద్రబాబునాయుడు అనే వ్యక్తి దేనికైనా సమర్థుడు. గుడిని, గుడిలోని లింగాన్ని స్వాహా చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు. ...

Read More »

చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్

చంద్రబాబు ఢిల్లీ టూర్‌పై ఎంపీ కేశినేని నాని హాట్ కామెంట్స్ చేశారు. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు, లోకేష్ భారీ అవినీతికి పాల్పడ్డారన్న కేశినేని. 2019లో మోదీ అధికారంలోకి రారని చంద్రబాబు అనుకున్నాడని, కాంగ్రెస్ కూటమిని కలుపుకుని ప్రధానమంత్రి అయిపోవచ్చని బాబు దురాశకు పోయాడంటూ వ్యాఖ్యానించారు. ‘‘అప్పట్లో నాతో మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టించాడు. మోదీని వ్యక్తిగతంగా నానా తిట్లు తిట్టాడు. 2019లో వైఎస్‌ జగన్‌ దెబ్బకు బొక్కబోర్లా పడ్డాడు. ఓడిపోయిన మరుక్షణం నుంచే చంద్రబాబుకు భయం పట్టుకుంది. కేంద్రం నుంచి కేసుల్లో ...

Read More »

పవన్ కళ్యాణ్ పై ఆర్జీవి సెటైరికల్ పోస్టర్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాజకీయాలపై ట్విట్టర్ లో పోస్టులు పెడుతూ.. ఎప్పుడూ వివాదాల్లో ఉండే విషయం తెలిసిందే. అయితే తాను తీయబోయే వెబ్ సిరీస్ శపథం ఆరంభం పై ట్విట్టర్ వేదికగా పోస్టర్లు విడుదల చేస్తున్నారు. ఈ పోస్టర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా ఉంది. ఈ పోస్టర్ లో జనసేన జెండా పట్టుకున్న చిన్న పిల్లలకు పవన్ కళ్యాణ్ కింద కూర్చోని ఉపదేశం ఇస్తున్నట్లుగా ఉంది. ఈ శపథం వెబ్ సిరీస్ చాప్టర్-1 ఏపీ ఫైబర్ ...

Read More »

సీఎం జగన్‌ మహాశివరాత్రి శుభాకాంక్షలు

మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. శుక్రవార ఉదయం నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. లింగాకార రూపుడైన శివునికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Read More »

తెలంగాణ మహిళలకు మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్

నల్లగొండ జిల్లాలోని ఛాయ సోమేశ్వర ఆలయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం సందర్శించారు. శివరాత్రి పర్వదినాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఏడాదిలోగా ఛాయ సోమేశ్వర ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. మహిళా పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని భరోసా ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నీ త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ఇప్పటికే నాలుగు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. మహిళలకు ఉపయోగపడేలా ఉచిత కరెంట్, ...

Read More »

తెలంగాణ సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నా: CM రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహా శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ పరమ శివుడ్ని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఉపవాస పూజలు చేస్తున్న భక్తులకు మహాశివుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నారు. కాగా, మహా శివరాత్రిని పురస్కరించుకొని రాష్ట్రంలోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిపోయాయి. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, టెంట్లతోపాటు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ...

Read More »

జీఓ నం.3 ర‌ద్దు చేయాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత డిమాండ్‌

భార‌త జాగృతి ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద దీక్ష‌కు దిగారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో మ‌హిళ‌ల‌కు జీఓ నం.3 శ‌రాఘాతంగా నిలుస్తోంద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఆరోపించారు. ఈ జీఓను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని ఆమె డిమాండ్ చేస్తూ ఇందిరాపార్క్ ధ‌ర్నా చౌక్ వ‌ద్ద దీక్ష చేస్తున్నారు. ఈ జీఓ ద్వారా మ‌హిళ‌ల‌కు ఉద్యోగ నియామ‌కాల్లో అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆమె అన్నారు. మ‌హిళ‌ల‌కు న్యాయం జ‌రిగే జీఓ నం.41ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు. అలాగే వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ...

Read More »