సేవా కార్య‌క్ర‌మాల్లో సుమ కనకాల

తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరియాన్ వ్యక్తి యాంకర్ సుమ. యాంకర్ గా గత 20 ఏళ్లుగా మన ఇంట్లో ఒకరిగా కలిసిపోయిన సుమ అప్పుడప్పుడు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంది. ప్రజలకు, ఇండస్ట్రీ లో ఉన్న పేద కార్మికులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు సుమ. ఇటీవల దసరా సందర్భంగా సుమ ఈ సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున ప్రజ్వల అనే మరో సేవా సంస్థ అధినేత సునీత కృష్ణన్ సంరక్షణలో ఉన్న పది మంది మహిళలకు జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సహాయం, అక్కడే ఉంటున్న పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఏర్పాటు చేసారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చిత్ర పరిశ్రమకు చెందిన 10 మంది మహిళలకు ఏడాది పాటు నిత్యావసర వస్తువులను, వారికి అవసరమైన మెడిసిన్ కూడా అందించారు.