Tag Archives: ap news

విశాఖలో జగన్‌ పర్యటన

జగన్‌ నేడు విశాఖలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి గన్నవరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్‌కు చేరుకొని.. ‘పార్లే ఫర్‌ ది ఓషన్‌’ సంస్థ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాల్స్‌, బీచ్‌ పరిరక్షణకు నిర్వహించిన కార్యక్రమాలు, ప్లాస్టిక్‌ నియంత్రణకు సంబంధించి జీవీఎంసీ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సిఎం సందర్శించారు. పార్లే ఫర్‌ ది ఓషన్‌ సంస్థ గిన్నిస్‌ రికార్డు నెలకొల్పేలా నేడు బీచ్‌ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపడుతోంది. జీవీఎంసీ, జిల్లా ...

Read More »

పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి ధర్మాన సవాల్‌

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌కు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సవాల్‌ విసిరారు. తనకు ఇప్పుడు 64 ఏళ్లని, పవన్‌ తనతో పాటు నడవగలరా? అన్నారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని పవన్‌ గ్రహించాలని ధర్మాన సూచించారు. ”సినిమాలో బొమ్మలతో యాక్షన్‌ చేస్తారు. పవన్‌ నడుస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చేశారు. నాతో నడవమనండి.. కనీసం 3 కిలోమీటర్లు కూడా నడవలేరు. మాటలు చెప్పినంత సులభంగా ఏమీ ప్రజాజీవితం ఉండదు” అని ధర్మాన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా లింగాలవలస గ్రామంలో మంత్రి ధర్మాన ‘గడపగడపకు’ ...

Read More »

రాజ్య‌స‌భ సభాపతి సీట్ లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

రీసెంట్ గా రాజ్య‌స‌భ వైఎస్ చైర్మ‌న్ ప్యానెల్ లో చోటు ద‌క్కించుకున్నారు వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. ఈ క్రమంలో ఆయనకు అరుదైన అవకాశం లభించింది. రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గైర్హాజరీలో సభా సమావేశాలను నిర్వహించే అవకాశం విజయసాయికి దక్కింది. ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో ఆయన ఇవాళ సభాపతి సీట్ లో దర్శనమిచ్చారు. కాసేపు సభా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఇంగ్లీషు, హిందీ భాషల్లో మాట్లాడుతూ సభను నడిపించారు. దీనికి సంబంధించిన వీడియోను వైసీపీ స్టేట్ పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షుడు ...

Read More »

జగన్‌ను కలిసిన జాహ్నవి దంగేటి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి బుధవారం కలిశారు. నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా జాహ్నవి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ నుంచి వరద బాధితులను పరామర్శించేందుకు బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని కలిసి.. పైలెట్‌ ఆస్ట్రొనాట్‌ అవ్వాలన్న తన కోరికను వివరించి, ఇందుకు అవసరమైన శిక్షణకు అయ్యే ఖర్చుకు సాయం చేయాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.

Read More »

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేకంగా నిలిచిన ఎపి

15వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకంగా నిలిచింది. మొత్తం 173 ఎమ్మెల్యేల ఓట్లు ఉండగా అన్నీ ఒకే అభ్యర్థికి వేసిన రాష్ట్రంగా ఎపి నిలిచింది. రాష్ట్రం నుండి వందకు వంద శాతం ఓట్లు ద్రౌపది ముర్ముకే పడ్డాయి. మరే రాష్ట్రంలోనూ వంద శాతం ఓట్లు ఒకే అభ్యర్థికి పడలేదు. ఎపిలో అధికార వైసిిపితో పాటు టిడిపి కూడా ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం ఓట్లు గంపుగుత్తగా ముర్ముకే పడ్డాయి. రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న ప్రథమ గిరిజన నేతగా, రెండవ ...

Read More »

తిరుపతిలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటన

 రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శనివారం ప్రత్యేక విమానంలో తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్‌కు జిల్లా కలెక్టర్‌ కె.వెంకట రమణా రెడ్డి సాదర స్వాగతం పలికారు. అక్కడి నుండి 11 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి అనంతపురం జెఎన్‌టియులో జరగనున్న కాన్వొకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్లారు. జిల్లా కలెక్టర్‌ కె .వెంకటరమణా రెడ్డి, ఎస్‌ పి.పరమమేశ్వర రెడ్డి, ఆర్డీఓ హరిత, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీనివాసులు, సిఐఎస్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ శుక్లా, తహసీల్దార్‌ శివప్రసాద్‌, ఎంపిడిఓ, తదితరులు గవర్నర్‌కు స్వాగతం ...

Read More »

ఎపి, ఒడిస్సాలపై అసాని ప్రభావం

ఎపి, ఒడిస్సాలపై అసాని తుఫాను తీవ్ర ప్రభావం చూపనుంది. తుఫాను ఎపిలోని తూర్పుతీరంలో కేంద్రీకృతమైందని, గంటకు 105 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండి) తెలిపింది. తుఫాను క్రమంగా బలహీన పడుతోందని, మంగళవారం రాత్రి నుండి ఎపిలోని ఉత్తర కోస్తాతో పాటు ఒడిస్సాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఇప్పటికే ఎపిలోని విశాఖ పట్నం పోర్ట్‌ను మూసివేశారు. వాతావరణ అననుకూల పరిస్థితుల కారణంగా 23 విమానాలను రద్దు చేసినట్లు విశాఖ పట్నం అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్‌ ...

Read More »

ప్రతి విద్యార్థీ దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి: హోమంత్రి

‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే ‘దిశ ‘యాప్‌, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్‌ ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.మహిళలపై దాడులను సీఎం జగన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టిడిపి నేతలకు అలవాటుగా మారిందన్నారు. ...

Read More »

ఎపిలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

ఎపిలో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీజిల్‌ ధరల పెరుగుదల నేపథ్యంలో డీజిల్‌ సెస్‌ రూపంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఛార్జీల పెంపునకు సంబంధించి ఏపిఎస్‌ఆర్టీసి ఎండీ ద్వారకా తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా ఆర్టీసీకి అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చాయన్నారు. ఆర్టీసీ రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోందని వివరించారు. డీజిల్‌ రేటు దాదాపు 60 శాతం పెరిగిందని, రెండేళ్లుగా రూ.5,680 కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. ప్రస్తుతం ...

Read More »

బాధ్యతల్ని స్వీకరించిన పలువురు మంత్రులు

 ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం నూతన మంత్రి మండలి కొలువుదీరిన సంగతి తెలిసిందే. మంగళవారం పలువురు మంత్రులు ఆ శాఖల బాధ్యతల్ని స్వీకరించారు. సచివాలయం 2వ బ్లాక్‌లో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పూజలు నిర్వహించి.. సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ, బిసి సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అలాగే విద్యాశాఖామంత్రిగా నియమితులైన బొత్ససత్యనారాయణ కూడా ఆ శాఖ బాధ్యతల్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్స్‌ డైరెక్టర్‌ దేవానందరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రవాణాశాఖామంత్రిగా పి. విశ్వరూప్‌ బాధ్యతలు చేపట్టారు.

Read More »